జీవిత‌కు ప‌ద‌వొచ్చింది

జీవిత‌కు ప‌ద‌వొచ్చింది

ఎన్ని పార్టీలు తిరిగినా ఇన్ని రోజులు ఎలాంటి ప‌ద‌వులు లేక టీవీ షోల‌ను న‌మ్ముకున్న జీవిత‌కు ఎట్ట‌కేల‌కు ఓ ప‌ద‌వి ద‌క్కింది. బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాల‌న్ తో పాటు ప్ర‌ముఖ హీరోయిన్లు జీవిత‌, గౌత‌మిల‌ను సెన్సార్ బోర్డు స‌భ్యులుగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఇటీవ‌లే సెన్సార్ బోర్డు మాజీ చీఫ్ పెహ‌ల‌జ్ నిహ‌లానీని తొలిగించి సీబీఎఫ్‌సీ బోర్డు చీఫ్‌గా ప్ర‌సూన్ జోషీని నియ‌మించారు.

జోషీ నేతృత్వంలోని కొత్త బోర్డు స‌భ్యుల‌ను ప్ర‌క‌టించారు. నూత‌న స‌భ్యుల్లో గౌతమి, న‌రేంద్ర కోహ్లి, న‌రేశ్ చంద్ర‌లాల్‌, నీల్ హెర్బ‌ర్ట్‌, వివేక్ అగ్నిహోత్రి, వామ‌న్ కేంద్ర‌, విద్యాబాల‌న్‌, టీఎస్ నాగ‌భ‌ర‌ణ‌, ర‌మేశ్ ప‌తంగి, వాని త్రిపాఠి, జీవితా రాజ‌శేఖ‌ర్, మిహిర్ భూటాలు ఉన్నారు. ఇన్నాళ్లూ పెహ‌ల‌జ్ నిహ‌ల‌నీ అత్యంత వివాదాస్ప‌ద సీబీఎఫ్‌సీ చీఫ్‌గా కొన‌సాగారు. ఆయన్ను తొలిగించ‌డంతో బాలీవుడ్ సంబ‌రాలు చేసుకుంటున్న‌ది. రెండున్న‌ర ఏళ్లు సీబీఎఫ్‌సీ చీఫ్‌గా నిహ‌లానీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

(Visited 312 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *