బీకాంలో ఫిజిక్స్ .. టీడీపీలో హ‌స్తం

బీకాంలో ఫిజిక్స్ .. టీడీపీలో హ‌స్తం

బీకాంలో ఫిజిక్స్ అన‌గానే ఇప్పుడు ఎవ‌రిక‌యినా గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్. ఆ మ‌ధ్య బీకాంలో ఫిజిక్స్ ఉంటుంద‌ని చెప్పి మీడియాలో, సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపిన జ‌లీల్ ఖాన్ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, నంధ్యాల టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితో పాటు టీడీపీ శ్రేణుల‌కు ద‌డ పుట్టిస్తున్నాడు.

నంధ్యాల‌లో ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా ఎక్కువ‌. అక్క‌డ ఓట్లు రాబ‌ట్టేందుకు చంద్ర‌బాబు నాయుడు మైనార్టీ నేత‌లు అంద‌రినీ ప్ర‌చారానికి పంపుతున్నాడు. అందులో భాగంగానే జ‌లీల్ ఖాన్ కూడా ప్ర‌చారానికి వెళ్లాడు. ప్ర‌చారంలో భాగంగా అన్నీ క‌ర‌క్టుగానే చెప్పిన జ‌లీల్ ఖాన్ హ‌స్తం గుర్తుకు ఓటేసి టీడీపీని గెలిపించండి అని చెప్పాడ‌ట‌. ఆఖ‌రులో హ‌స్తం గుర్తు అని చెప్పేస‌రికి అభ్య‌ర్థితో స‌హా టీడీపీ శ్రేణులు అన్నీ అవాక్క‌య్యాయ‌ట‌.

(Visited 500 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *