ద‌గ్గుబాటికి జ‌గ‌న్ గాలం !

ద‌గ్గుబాటికి జ‌గ‌న్ గాలం !

పీకె (ప్ర‌శాంత్ కిషోర్) స‌ల‌హాలతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముందుకు వెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌క‌డ్భంధీ ప్ర‌ణాళిక‌లే వేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. గ‌త కొన్నాళ్లుగా త‌న స‌హ‌జ‌దోర‌ణికి భిన్నంగా జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 2019 ఎన్నిక‌లు టార్గెట్ గానే నంధ్యాల ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప్ర‌శాంత్ కిశోర్ సూచ‌న‌ల మేర‌కు అక్క‌డ తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో భాగంగా చంద్ర‌బాబు నాయుడు స‌డ్డ‌కుడు, మాజీ కేంద్ర‌మంత్రి పురంధేశ్వ‌రి భ‌ర్త‌, చంద్ర‌బాబు కంటే ముందు టీడీపీలో చ‌క్రం తిప్పిన దగ్గుబాటి వెంక‌టేశ్వ‌ర్ రావును త‌న పార్టీలోకి జ‌గ‌న్ ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ద‌గ్గ‌ర‌వ్వాలంటే ఈ దంప‌తులే క‌ర‌క్ట్ అని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు అనిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీలో చేరినా పురంధేశ్వ‌రి ఓట‌మి ఖాయం అనుకున్న రాజంపేట‌ను పొత్తులో భాగంగా చంద్ర‌బాబు బీజేపీకి కేటాయించాడు.

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత పురంధేశ్వ‌రి బాబు మీద అనేక‌సార్లు ఆగ్రహం వ్య‌క్తం చేసింది. చంద్ర‌బాబుకు, వెంక‌టేశ్వ‌ర్ రావుకు తీవ్ర విభేధాలు ఉన్నాయి. ఇక ఆంధ్రాలో బీజేపీ ఎదిగే ప‌రిస్థితి లేదు. అందుకే జ‌గ‌న్ పార్టీ నుండి వ‌చ్చిన హామీకి ఒప్పుకుని త్వ‌ర‌లోనే పార్టీలో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత్ కిశోర్ సూచ‌న‌ల మేర‌కే జ‌గ‌న్ ఈ ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్లు చెబుతున్నారు. మ‌రి ద‌గ్గుబాటి పార్టీ జంప్ ఎప్పుడో వేచిచూడాలి.

 

(Visited 473 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *