102 డిగ్రీల జ్వరంతో ..ఆనాడు

102 డిగ్రీల జ్వరంతో ..ఆనాడు

మీరు ఆంధ్రా పాల‌కుల‌కు బానిస‌లై .. తెలంగాణ‌కు ద్రోహం చేస్తూ రండ‌లై మీ ఇండ్ల‌ల్ల ప‌డుకుంటే 102 డిగ్రీల జ్వ‌రంతో ఎనిమిది రోజుల పాటు ఆర్డీఎస్ నీళ్ల కోసం పాద‌యాత్ర చేసిన గొప్ప మ‌నిషి కేసీఆర్ .. మీరు కేసీఆర్ కాలి గోటికి గానీ, కాలి దుమ్ముకు గాని స‌రిపోరు అని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి కాంగ్రెస్ నేత‌లు, వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ఉద్దేశించి విమ‌ర్శించారు. ద‌క్షిణ తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని, జూరాల సామ‌ర్ధ్యం పెంచాలి, ఆర్డీఎస్ రైతుల‌కు న్యాయం చేయాలి అంటూ వ‌న‌ప‌ర్తిలో చిన్నారెడ్డి చేప‌ట్టిన ఒక రోజు దీక్ష నేప‌థ్యంలో ఆయ‌న వైఖ‌రిని త‌ప్పుప‌డుతూ నిప్పులు చెరిగారు. నీళ్లంటే టీఆర్ఎస్ .. నీళ్లంటే కేసీఆర్ .. నీళ్లంటే తెలంగాణ.. నీళ్లంటే నిరంజ‌న్ రెడ్డి .. వ‌న‌ప‌ర్తి నియోజ‌వ‌ర్గంలో ఈ రోజు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో రిజిస్ట‌ర్ అయిన మాట‌లు ఇవి. ఈ ప‌రిస్థితి చూసి త‌ట్టుకోలేక పోయే ముందు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ఓ వెకిలియ‌త్నం చిన్నారెడ్డి చేస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

ద‌క్షిణ తెలంగాణ‌కు న్యాయం చేయాలి అని చిన్నారెడ్డి అన‌డం అవ‌గాహ‌నా రాహిత్యానికి నిద‌ర్శ‌నం అని, తెలంగాణ‌లోని ప్ర‌తి ఇంచు టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి స‌మానం అని, అన్ని ఎక‌రాల‌కు నీళ్లిస్తుంద‌ని నిరంజ‌న్ రెడ్డి అన్నారు. ఆర్డీఎస్ పాద‌యాత్ర సంధ‌ర్భంగా అప్ప‌ట్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్డీఎస్, సుంకేశుల కింద భూముల‌ను స‌స్య‌శ్యామలం చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఇచ్చిన హామీ మేర‌కు ఏడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో తుమ్మిళ్ల ఎత్తిపోత‌ల ప‌థ‌కం కాంగ్రెస్ నేత‌ల కండ్ల‌కు క‌నిపిస్త‌లేదా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ హ‌యాంలో ప్రాజెక్టులు మొద‌లుపెడితే 30 ఏండ్లు, న‌ల‌బైఏండ్ల‌పాటు నిర్మాణాలు కొన‌సాగించార‌ని, తెలంగాణ రాష్ట్రంలో ఏడాది నుండి నాలుగేళ్ల‌లో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఏడాది లోపు తుమ్మిళ్ల నీళ్లు పారిస్తామ‌ని అన్నారు. సొంత ఊరు జ‌య‌న్న తిర్మ‌లాపురం గ్రామానికి నీరు తెచ్చే సోయి లేని ఎమ్మెల్యే చిన్నారెడ్డి జూరాల‌, ఆర్డీఎస్ నీళ్ల గురించి సిపాయిలా మాట్లాడ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు తెలంగాణ ప్ర‌భుత్వంలో చిన్నారెడ్డి సొంత మండ‌లం గోపాల్ పేట‌కు నీళ్లు తీసుకువ‌చ్చామ‌ని సింగిరెడ్డి అన్నారు.

1981 లో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం జూరాల ప్రాజెక్టు నుండి 18 టీఎంసీలు వాడుకునే విధంగా డిజైన్ చేశారు.. కానీ నిర్మాణానికి వ‌చ్చేస‌రికి కేవ‌లం 12 టీఎంసీల‌కు కుదించింది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే. ఇక ప్రాజెక్టులో పూడుకుపోయిన ఒండు మూలంగా జూరాల‌లో నిలిచే నీళ్లు దాదాపు ఎనిమిది టీఎంసీలు మాత్ర‌మే అని సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి వివ‌రించారు. క‌ర్ణాట‌క‌లోని ఆరుగ్రామాలు మునుగుతుంటే దానికి ఇవ్వాల్సిన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌కుండా ముప్ప‌య్యేండ్ల పాటు సాగ‌దీశార‌ని, రూ.70 కోట్లు ఇవ్వ‌ని కార‌ణంగా క‌ర్ణాట‌క అభ్యంత‌రాల‌తో 2013 వ‌ర‌కు జూరాలలో పూర్తి స్థాయి నీటిని స్టోరేజ్ చేయ‌లేద‌ని అన్నారు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో క‌ర్ణాట‌క‌కు డ‌బ్బులు చెల్లించార‌ని తెలిపారు.

పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల నిర్మాణం కొర‌కు స‌హ‌క‌రించాల‌ని ఏనాడు రైతాంగాన్ని క‌లిసి కోర‌ని, క‌నీసం ప‌త్రిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌ని చిన్నారెడ్డి పాల‌మూరు నీళ్ల గురించి, రైతుల ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడ‌డం విడ్డూరం అని అన్నారు. జూరాల నీటి పూర్తి సామ‌ర్ధ్యం 18 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆలోచ‌న ఉంద‌ని, కోయిల్ సాగ‌ర్ కు నాలుగు టీఎంసీలు తీసుకుని స‌ద్వినియోగం చేస్తున్నామ‌ని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. అవ‌గాహ‌న లేని ఆందోళ‌న‌లు చేస్తే ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని .. చేత‌న‌యితే శాస‌న‌స‌భ్యునిగా శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ‌కు వెళ్ల‌వ‌చ్చు క‌దా అని సూచించారు.

శాస‌న‌స‌భ‌లో తెలంగాణ‌లోని అన్ని ప్రాజెక్టుల మీద ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ పెట్టార‌ని, ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌ను స‌భ ముందు, ప్ర‌జ‌ల ముందు పెడ్తామ‌ని కాంగ్రెస్, విప‌క్షాల‌ను ఆహ్వానించార‌ని .. ఆ స‌మావేశానికి హాజ‌రు కాకుండా కాంగ్రెస్ నేత‌లు త‌ప్పించుకున్నార‌ని, మ‌రి పాల‌మూరుకు అన్యాయం జ‌రిగింద‌ని మాట్లాడే చిన్నారెడ్డి ఆ రోజు శాస‌న‌స‌భ‌కు హాజ‌రై పాల‌మూరుకు జ‌రిగిన అన్యాయాన్ని, జ‌ర‌గాల్సిన న్యాయాన్ని ఎందుకు స‌భ ముందు ఉంచలేద‌ని నిరంజ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఊరిని లేపే కోడి తొలికోడి అని .. తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం కూసిన తొలికోడి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని, లోక‌మంతా లేచిన త‌ర‌వాత పెంట‌కుప్ప‌ల మీద కాళ్ల‌తో గెలుకుతూ కూసే మురికికోళ్లు కాంగ్రెస్ నేత‌లు అని సింగిరెడ్డి విమ‌ర్శించారు.

నీళ్లడిగితే వైఎస్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డ‌ని గ‌మ్మున్న కూర్చున్న చేత‌గాని ద‌ద్ద‌మ్మ‌లు క‌నీసం పాల‌మూరుకు ఒక్క ప్ర‌తిష్టాత్మ‌క క‌ళాశాల అయినా ఎందుకు తేలేద‌ని ప్ర‌శ్నించారు. ద‌క్షిణ తెలంగాణ .. ఉత్త‌ర తెలంగాణ అని ఏదో అవుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నార‌ని, పాల‌మూరు రూ.400 కోట్ల‌తో తొలి మెడిక‌ల్ క‌ళాశాల మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో, తొలి వ్య‌వ‌సాయ క‌ళాశాల పాలెంలో, తొలి ఫిష‌రీస్ క‌ళాశాల వ‌న‌ప‌ర్తి జిల్లాకు వ‌చ్చింద‌ని, ఇది తెలంగాణ ప్ర‌భుత్వం చూపిన చిన్న‌చూపా ? మీరు గుడ్డోళ్ల‌యితె లోకం గుడ్డిది కాద‌ని సింగిరెడ్డి అన్నారు.

(Visited 1,375 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *