కేసీఆర్ “ఫర్ ఫార్మర్స్ & వీవర్స్”

కేసీఆర్ "ఫర్ ఫార్మర్స్ & వీవర్స్"

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను, మరెన్నో కార్యాక్రమాలను చేస్తూ, ఒక రైతు పక్షపాతిగా పాలన సాగిస్తున్న సందర్బంగా వారి కృషిని ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల పై అవగాహాన పెంచాలని ఎన్నారై టి.ఆర్.యస్ – యుకె ఆద్వర్యం లో “కెసిఆర్ ఫర్ ఫార్మర్స్ & వీవర్స్ ” అవగాహాన – శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగిందిందని ఉపాధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసారి తెలిపారు.

లండన్ లోని అంబేద్కర్ హౌస్ నుండి ప్రారంభమైన ర్యాలీ, సెంట్రల్ లండన్ మీదుగా భారత హై కమిషన్ కార్యాలయం వద్ద ఉన్న నెహ్రు విగ్రహం వరకు జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే “జాతీయ పసుపు బోర్డు” ను ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకోవాలని, ఎంపీ కవిత చేస్తున్న పోరాటానికి దేశమంతా మద్దత్తు ఇచ్చి విజయవంతం చేయాలనీ, తెలంగాణ హరితహారం లో అందరు బాగస్వాములవ్వాలని, చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని, రైతు పక్షపాతి కెసిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ చేసిన నినాదాలు లండన్ వీధుల్లో మారుమోగాయి.

భారత హై కమీషన్ కార్యాలయంకి చేరుకొని అక్కడున్న నెహ్రు విగ్రహానికి పూలు సమర్పించి, కేంద్ర ప్రభుత్వం వెంటనే “జాతీయ పసుపు బోర్డు” ను ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకోవాలని, ప్రధాన మంత్రి, సంబంధిత మంత్రులు వెంటనే స్పందించి నిర్ణయం తీసుకొవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం జాతీయ పసుపు బోర్డు ను వెంటనే ఏర్పాటు చేయాలని భారత హై కమీషన్ కార్యాలయానికి వినతి పత్రం సమర్పించారు.

తరువాత ఏర్పాటు చేసిన సమావేశం లో ఎన్నారై టి. ఆర్. యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి బంగారు తెలంగాణ నిర్మాణం వరకు ఇదే లండన్ లో మా వంతు బాధ్యతగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ నాయకత్వానికి సంఘీభావంగా ఎన్నో కార్యక్రమాలు చేశామని, అదే స్పూర్తితో నేడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు భాంధవుడిగా, రైతు పక్షపాతిగా వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు చేపట్టరాని, ప్రపంచానికే ఆదర్శనంగా నిలుస్తున్న సందర్బంగా “కెసిఆర్ ఫర్ ఫార్మర్స్ & వీవర్స్ ” కార్యక్రమం చెప్పట్టామని తెలిపారు.

నేడు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కేవలం కెసిఆర్ గారి నాయకత్వం లోనే సాధ్యమవుతుందని, సందర్భం ఏదైనా మనమంతా వారి వెంట ఉండి వారి నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే “జాతీయ పసుపు బోర్డు” ను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన “తెలంగాణ కు హరితహారం” లో ప్రజలంతా పాల్గొని విజయ‌వంతం చేయాలని కోరారు.

తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బాలమూరి మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆలోచనలను, ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కై ఎవరు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిన ముందుండి ప్రోత్సహిస్తామని, నేడు పసుపు రైతుల సంక్షేమానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వారి అభివృధికి కృషి చేస్తున్న కవిత పోరాటానికి సంఘీభావంగా నేడు ఎన్నారై టి. ఆర్. యస్ – యూకే శాఖ చేస్తున్న శాంతియుత నిరసన ర్యాలీకి అన్ని విధాలా మద్దత్తునిస్తు, కేంద్ర ప్రభుత్వం వెంటనే పసుపు బోర్డు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నారై తెరాస సెక్రటరీ మరియు అధికార ప్రతినిధి చాడ సృజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. పసుపు రైతుల కష్టాలు తీరాలన్నా, పసుపు రైతుల ఆత్మహత్యలు ఆగాలన్న నేషనల్ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. ఎంపీ కవిత పసుపు రైతులకోసం చేస్తున్న ఉద్యమానికి మద్దతు గా ఎన్నారై లు అందరు కూడా మద్దతుగా రైతుల కోసం పోరాటం చేయాలని పిలునిచ్చారు.

ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్ది రాజు, నాయకులు రమేష్ ఏసంపల్లి, హరి నవపేట్ మాట్లాడుతూ బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా మేము ఎక్కడున్నా అన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రవాస తెలంగాణ బిడ్డలకు వారధిలా ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాల పై అటు క్షేత్రస్థాయిలో ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణ బిడ్డల కు అవగాహన వచ్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జాతీయ పసుపు బోర్డు కై పోరాటం చేస్తున్న ఎంపీ కవిత కృషి వియజయవంతం కావాలని, కేంద్రం పై ఒత్తిడి తేవడానికి మరింత కృషి చేస్తామని తెలిపారు.

నాయకులు శ్రీకాంత్ జెల్లా మాట్లాడుతూ, చేనేత కార్మికులకు తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వీరిని విస్మరించారని, నేడు నేతన్నలు కెసిఆర్ నాయకత్వం లో సంతోషంగా ఉన్నారని, ఆగస్టు 7 వ తేదీని “నేషనల్ హ్యాండ్లూమ్ డే” గా పురస్కరించుకొని, ప్రజలంతా చేనేత వస్త్రాలని ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. చేనేత రంగం పై మంత్రి కేటీఆర్ ప్రత్యేక బాధ్యత మాకెంతో స్ఫూర్తినిస్తుందని, మేమంతా కూడా వారి పిలుపు మేరకు వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు దరిస్తున్నామని తెలిపారు.

ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, మేము చేపట్టిన ర్యాలికి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన స్థానికి యూకే ప్రభుత్వ అధికారులకు, పోలీస్ శాఖకు, భారత హై కమీషన్ కు, అలాగే కార్యక్రమం విజవంతం కావడానికి సహకరించిన ప్రవాస తెలంగాణ బిడ్డలకు, కార్యవర్గ సభ్యులకు జాగృతి ప్రతినిధులకు, మీడియా సంస్థలకు ప్రత్యేక కృతఙతలు తెలిపారు.

కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శిలు శ్రీధర్ రావు తక్కలపెల్లి మరియు సృజన్ రెడ్డి చాడా, ముఖ్య నాయకులు హరి నవపేట్, రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, రవి రతినేని, సురేష్ బుడగం, వినయ్ ఆకుల,సత్య చిలుముల, రమేష్ ఎసెంపల్లి, నవీన్ మాదిరెడ్డి, వేణు మరియు జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బాలమూరి, జాగృతి నాయకులు లండన్ గణేష్ ,వంశీ సముద్రాల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

(Visited 95 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *