‘పీకే’సుకుంటున్న రాధాకృష్ణ

'పీకే'సుకుంటున్న రాధాకృష్ణ

స‌క‌ల శాస్త్రాలు ఆకిట్ల‌ మూత్రాలు అని సామెత‌. నంధ్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు అనుకూల మీడియాకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇన్ని రోజులు ఏం రాసిన బాబు మీడియాకు చెల్లిపోయింది. నాణానికి ఒక‌వైపే చూయించారు. ఇంకో వైపు ప్ర‌జ‌ల‌ను చూసే అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక మీడియాలో హంగామా చేసి త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించే వారు. అయితే సోష‌ల్ మీడియా రాక‌తో చంద్ర‌బాబు అండ్ కో మీడియా ప‌రిస్థితి మారిపోయింది. తామెంత ప్ర‌చారం చేసినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆందోళ‌న‌లో మునిగారు.

తాజాగా ఆంధ్ర‌జ్యోతి ఓ వార్త రాసింది. జ‌గ‌న్ కు రాజ‌కీయ వ్యూహాలు రూపొందిస్తున్న ప్ర‌ముఖుడు ప్ర‌శాంత్ కిషోర్ ఆలియాస్ పీకె సోష‌ల్ మీడియాలో బాబుకు వ్య‌తిరేక ప్ర‌చారం చేసి అడ్డంగా దొరికాడ‌న్న‌ది ఆ వార్త సారాంశం. సోష‌ల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల‌తో ప్ర‌శాంత్ కిశోర్ బృందం చంద్ర‌బాబు నాయుడు మీద వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నాడ‌ని, అనుమానం వ‌చ్చిన టీడీపీ వ‌ర్గాలు ఆ అకౌంట్ల‌ను ప‌రిశీలిస్తే ఇటీవ‌ల పంజాబ్ ఎన్నిక‌ల సంధ‌ర్భంగా ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ కు అనుకూలంగా పెట్టిన పోస్టులు క‌నిపించాయ‌ని, అడ్డ‌దారి ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆయ‌న ఇలా దొరికిపోయాడ‌ని వార్త‌లో పేర్కొన్నారు.

ప్ర‌శాంత్ కిశోర్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త గ‌తంలో మోడీకి, ఆ త‌రువాత నితీష్ కు , తాజాగా పంజాబ్ లో కాంగ్రెస్ కు, ఇప్పుడు జ‌గ‌న్ కు ప‌నిచేస్తున్న‌ది బ‌హిరంగంగా అందరికీ తెలిసిందే. ఓ కాంట్రాక్టు అయిపోయినోడు ఇంకోటి ఎలా చేస్తాడో ఇప్పుడు ప్ర‌శాంత్ కిశోర్ అదే చేస్తున్నాడు. ఇక్క‌డేదో తెలియ‌ని ర‌హ‌స్యం గుర్తించిన‌ట్లు రాధాకృష్ణ ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఏముందో ఎవ‌రికీ అర్థం కాదు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మ సొల్లు రాత‌ల‌ను జ‌నం న‌మ్మ‌క‌పోవ‌డంతో బాబు మీడియాకు బుగులు తీసుకుంది అన్న‌ది రాధాకృష్ణ వార్త‌తో మాత్రం తేలిపోయింది.

(Visited 1,197 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *