ఇగిలిస్తున్న ఇందూరు

ఇగిలిస్తున్న ఇందూరు

కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల‌, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం త‌రువాత తెలంగాణ ప్రాజెక్టుల‌లో మ‌రో కీల‌క ప్రాజెక్టుకు ఈ రోజు ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీజం ప‌డుతుంది. ఉత్తర తెలంగాణకు ఊపిరిపోసే ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఇందూరు రైతుల్లో ఆనందం రేపింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్‌లో ఈ ప్రారంభోత్స‌వానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాను. ఈ ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పైలాన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అనంతరం 1.10 గంటలకు అక్కడే ఏర్పా టు చేసిన భారీ బహిరంగసభనుద్దేశించి ప్రసంగించనున్నారు.

భారీ ఎత్తున నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ‌స‌భ‌కు ట్రాక్ట‌ర్లు, లారీలు, డీసీఎంల‌లో జ‌నం క‌ద‌లిరానున్నారు. సమైక్య పాల‌న‌లో నిర్ల‌క్ష్యానికి గురై మూల‌న ప‌డ్డ ఎస్సారెస్పీకి తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో జీవ‌క‌ళ రానుంది. వ‌చ్చే ఏడాది జులై నాటికి ప‌నులు పూర్తి చేసి నీళ్లు పారిస్తామ‌ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ఏండ్ల త‌ర‌బ‌డి నీళ్లు లేక ఆందోళ‌న‌లో ఉన్న రైతాంగానికి ఈ మాట‌లు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి.

60 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ.

ఎస్సారెస్పీ అతిథి గృహం సమీపంలో సుమారు 60 ఎకరాల మైదానాన్ని బహిరంగ సభకు సిద్ధం చేశారు. సభకు 600 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. 60 అడుగుల పొడవు, 40అడుగుల వెడల్పు, ఏడు అడుగుల ఎత్తుతో సభా వేదికను నిర్మించారు. వేదికపై ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు 100 మంది ప్రముఖులు పాల్గొనేలా ఏర్పాట్లుచేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మైదానం వరకు నాలుగు రోడ్లను ఏర్పాటుచేశారు. ఎటువంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా బారికేడ్లను అమర్చారు. వేదిక కుడి పక్కన సాంస్కృతిక కార్యక్రమాల వేదికను నెలకొల్పారు. హెలీప్యాడ్ నుంచి సభాస్థలి వరకు సీఎం రావడానికి ప్రత్యేకమైన రోడ్డు వేశారు. సభా వేదికను భద్రతా సిబ్బంది పూర్తిగా తనిఖీ చేసి, వేదిక నాణ్యతను పరీక్షించారు. సభా మైదానం చుట్టూ గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ షెడ్యూల్

గురువారం 11 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని పునర్జీవ పనులకు శంకుస్థాపన చేస్తారు.
11:30 గంటలకు ప్రాజెక్టు వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలిస్తారు.
1:10 గంటలకు బహిరంగసభనుద్దేశించి ప్రసంగిస్తారు.

(Visited 372 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *