లండన్ లో ఘనంగా జయశంకర్ సార్ కి నివాళి

లండన్ లో ఘనంగా జయశంకర్ సార్ కి నివాళి

కేసీఆర్, టీఆర్ఎస్ స‌పోర్ట‌ర్స్ ఆఫ్ యూకే ఆధ్వ‌ర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి జయంతి వేడుకులని లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి టీఆర్ఎస్ శ్రేణులు,తెలంగాణ వాదులు, పాల్గొన్నారు. సురేష్ గోపతి అద్యక్షణ ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్నిపూల తో నివాలర్పించి, జయశంకర్ గారినిస్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండునిమిషాలు మౌనం పాటించారు.
తరువాత సంస్థ ప్రతినిథులు సురేష్ గోపతి మాట్లాడుతూ,తెలంగాణ బావజాల వ్యాప్తి లో జయశంకర్ గారిపాత్రా గొప్పదని, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి కొత్తపల్లి జయశంకర్‌ సారు. నాన్‌ ముల్కీ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ సాధన పోరాటం వరకు ఆయన పాత్ర చిరస్మరణీయం వారు చివరి వరకుతెలంగాణ రాష్ట్ర సాధన కోసమైపనిచేసారని, అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భం లో మన వద్దు లేకపోవడం చాల బాధాకరం అనిపేర్కొన్నారు.

గోలి తిరుపతి మాట్లాడుతు అనుకున్నఆశయ సాధనకై వారు చేసి కృషిప్రతి వ్యక్తి జీవితం లో ఆదర్శంగా తీసుకోవాలని,వారి జీవిత వృతాన్తాన్ని పాట్యపుస్తకాల్లలో పెట్టాలని, రాబోయే తరాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది అన్ని కొనియాడారు. రంగు వెంకట్ మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య గారిమానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగామనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.
సంస్థ ఫౌండర్ ఛైర్మెన్ సిక్కా చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రో.జయశంకర్ గారి జయంతి వేడుకులని సందర్భం గా సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్ ని అందజేయడం జరిగినది మరియు రాబోయే రోజులో సంస్థ చేయబోయే వివిధ సేవ కారిక్రమాల గురుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ యూకే జాగృతి అధ్యక్షులు సుమన్ బలమూరి, మరియు సభ్యులు లండన్ గణేష్ , jtrdc అధ్యక్షులు సృజన రెడ్డి చాడ మరియు సభ్యులు మధు అందేం ,యూకే లో స్థిరపడి ఇక్కడ ప్రముఖ bbc సంస్థ పనిచేసి కరీంనగర్ జిల్లా వాసి భారతి గారు ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు . కెసిఆర్ తెరాస సపోర్టర్స్ అఫ్ యూకే సంస్థ సభ్యులు గోలి తిరుపతి ,భాస్కర్ మొట్ట , ప్రశాంత్ , శ్రీధర్ ,రఘు నక్కల,నరేష్ మర్యాల ,వెంకట్ రంగు,వేణు రెడ్డి ,పాల్గొన్నారని ఈ సందర్భం గ తెలియచేసినారు .

(Visited 16 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *