మోత్కుప‌ల్లికి వెంక‌య్య హామీ

మోత్కుప‌ల్లికి వెంక‌య్య హామీ

మూడేళ్లుగా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఊహ‌ల్లో తేలియాడుతున్న తెలంగాణ టీడీపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆశీస్సులు ల‌భించాయి. త‌న‌ను క‌లిసిన టీడీపీ నేత‌ల‌తో స‌మావేశం అయిన ఆయ‌న త్వ‌ర‌లోనే శుభ‌వార్త వింటారు .. ‘కాబోయే గవర్నర్’ అంటూ సంబోధించారు. దీంతో మోత్కుప‌ల్లి ఉబ్బిత‌బ్బిబ్బు అయ్యారు.

పార్టీని వీడ‌తాడ‌న్న అనుమానంతో చంద్ర‌బాబు నాయుడు మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఆశ‌చూపాడు. దీంతో అదే ఆశ‌తో మూడేళ్లుగా మోత్కుప‌ల్లి టీడీపీలో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. అయితే ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వితో రాజ‌కీయాల‌కు దూర‌మ‌యిన వెంక‌య్య నాయుడు మాట‌లు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌ని మోత్కుప‌ల్లి వ‌ర్గీయులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆంధ్రాకు అద‌న‌పు నిధులు ఇవ్వ‌మ‌ని ఈ రోజు కేంద్రం తేల్చిచెప్పింది. ఇక మోత్కుప‌ల్లి క‌ల నిజం అవుతుందా అన్న‌ది అనుమాన‌మే.

(Visited 841 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *