ఈ విష‌యం తెలిసి చంద్ర‌బాబే ..

ఈ విష‌యం తెలిసి చంద్ర‌బాబే ..

నిజంగా ఈ విష‌యం తెలిసి చంద్ర‌బాబు నాయుడే ఆశ్చ‌ర్య‌పోయి ఉంటాడు. కొంద‌రు ఆంధ్రా వారి తెలివి ఎలా ఉంటుందో హైద‌రాబాద్ లో ఏర్ప‌డిన ప‌లు కాల‌నీల‌ను చూస్తే తెలుస్తుంది. అప్ప‌నంగా భూమి, ఇండ్లు వ‌స్తాయంటే ఎంత‌లా ఉబ‌లాట‌ప‌డిపోతారో తాజా సంఘ‌ట‌న రుజువు చేస్తుంది. అయితే ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టులు అదీ ఉన్న‌త‌స్థాయిలో ఉన్న వారి నుండి ఈ ప్ర‌తిపాద‌న రావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా నిర్మిస్తాన‌ని గ‌త మూడేళ్లుగా ఊరిస్తూ అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు స‌చివాల‌యం, శాస‌న‌స‌భ‌ను మాత్రం నిర్మించాడు ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. అవి కూడా తాత్కాలికం కావ‌డం గ‌మ‌నార్హం. బిస్కెట్లు వేసి మీడియాలో చ‌లామ‌ణి కావ‌డంలో ఆరితేరిన చంద్ర‌బాబు నాయుడు తాజాగా జ‌ర్న‌లిస్టుల‌తో మాటా ముచ్చ‌ట పెట్టుకున్నాడు.

త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న జ‌ర్న‌లిస్టుల‌ను పిలుచుకున్నాడు. ఈ సంధ‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల సంక్షేమం, ప్ర‌భుత్వ అండ అంటూ నోటికొచ్చిన హామీ ఇచ్చేశాడు. జ‌ర్న‌లిస్టుల‌కు అమ‌రావ‌తిలో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లు నిర్మించి ఇస్తాన‌ని చెప్పాడు చంద్ర‌బాబు. దీంతో లేని స్వామిభ‌క్తిని కొనితెచ్చుకున్న ఓ జ‌ర్న‌లిస్టు లేచి త‌మ‌కోసం ఇంత చేస్తున్న చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త‌గా ఇండ్లు నిర్మించి ఇస్తే ‘దేవాన్ష్ కాలనీ’ అని పెట్టుకుంటామ‌ని అన్నాడు.

ఇప్ప‌టికి ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు కొడుక్కే దిక్కులేదు. కానీ ఆ జ‌ర్న‌లిస్టు ఏకంగా చంద్ర‌బాబు మ‌న‌వ‌డి పేరును పెట్టుకుంటామ‌ని చెప్ప‌డం విశేషం. ఈ ఐడియా చూసి చంద్ర‌బాబుకే కండ్లు తిరిగి ఉంటాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం ఏమి లేదు.

(Visited 1,003 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *