ఆదుకునే ప్రయత్నం అంటే కేటీఆర్ దే!

ఆదుకునే ప్రయత్నం అంటే కేటీఆర్ దే!

ఒక రంగం దెబ్బతిని పోతున్నదంటే, నలుగురూ స్పందించి ఆదుకుంటే తప్ప ఆ రంగాన్ని నమ్ముకున్న కుటుంబాలు మొత్తం ఛిద్రం అయిపోతాయనే అభిప్రాయం కలిగిందంటే.. ఆదుకోవడానికి ముందుకు వచ్చే వదాన్యులు ఎంతో మంది మన సమాజంలో ఉంటారు. కానీ వీరందరికీ తెలిసింది ఒక్కటే పద్ధతి. తమ వద్ద ఉన్న మొత్తం లో తమ సంపాదన, తమ సంపదలో కొంత వారికి కేటాయించడం.. కుదేలవుతున్న రంగాన్ని నిలబెట్టడానికి ఆ మొత్తం కేటాయించేయడం మాత్రమే. కానీ కేవలం చందా ఇచ్చేయడం అనేది సాయం అనిపించుకోదు. ఆ రంగాన్ని నిలబెట్టడానికి చేసే నిర్మాణాత్మకమైన కృషి మాత్రమే.. అసలు సిసలు ప్రయత్నం అనిపించుకుంటుంది. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇప్పుడు అదే పని చేస్తున్నారు.

చేనేత రంగం ఎన్ని రకాలుగా నష్టపోతున్నదో, చేనేత కార్మికులు ఎంత దెబ్బతింటున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అంతా మాట్డాడుకుంటూనే ఉన్నారు.  కాకపోతే.. విరాళాల రూపంలో కాకుండా ఆ రంగానికి ఏం చేయవచ్చో మాత్రం సరైన ప్రయత్నాలు జరగడం లేదు. ప్రభుత్వాలు కూడా చేనేత రంగానికి అప్పులు, వడ్డీలేని అప్పులు, రుణ మాఫీ లు అంటూ.. ఏదో చందాలిచ్చే తరహా పథకాలు చెబుతుందే తప్ప.. ఆ రంగం తన కాళ్లపై తాను నిలబడగలిగే పరిస్థితి ఎలా వస్తుందో ఆలోచించదు. కానీ కేటీఆర్ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.

చాలా మంది సదాలోచన పరుల్లాగే ఆయన కూడా తన సోదరి కవిత వచ్చి రాఖీ కట్టినప్పుడు.. ఆమెకు తిరిగి కానుకగా చేనేత చీర ఇచ్చారు. కానీ.. ఇది మాత్రమే ఆయన చేసిన ప్రయత్నం కాదు. చేనేత అనే పదానికే గౌరవం పెంచే, క్రేజ్ పెంచే ప్రయత్నానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు. చేనేత వస్త్రాల ప్రదర్శనలతో ఓ ఫ్యాషన్ షో కూడా అతిథిగా హాజరయ్యారు. చేనేత అనేది ఏదో ముసలివాళ్లు పాతతరం వాళ్లకు సంబంధించినది అనే దురభిప్రాయాన్ని చెరిపేసేందుకు, నవతరం యువతరంలో కూడా చేనేత పట్ల ఆసక్తి కలిగించేందుకు తద్వారా ఆ రంగం శాశ్వతంగా బాగుపడేందుకు ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి. కేటీఆర్ కూడా ఇదే తొలిప్రయత్నంగానే ఎంచి మరింత కృషి సాగిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎవరూ ఆకలి చావులు చచ్చే దుస్థితి రాదని అనుకోవచ్చు.

(Visited 251 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *