2017

న్యూజెర్సీలో తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రవాస తెలంగాణ, ఆంధ్ర సాహితీవేత్తలను , కవులను , మరియు సంగీత , నృత్య ,జానపద కళాకారులను ఆహ్వానం పలకడంలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభల ప్రవాస సమన్వయ కర్త శ్రీ మహేష్ బిగాల గారు ,ముఖ్య అతిధి గా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ని, న్యూ జెర్సీ లో , రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో సన్నాహక సదస్సు , కిక్కిరిసిన తెలుగు భాష ప్రేమికుల మధ్య ఘనంగా జరిగింది . మన తెలంగాణ

మెంట‌ల్ కృష్ణ ఆంధ్రుల‌ గుండెలు గెలికాడు

నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని మ‌మ్మ‌ల్ని తెలుగు రోహింగ్యాల‌ను చేస్తారా ? ఏపీలో ఆధార్, ఓటరు కార్డు లేనివాళ్లు ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? లోకేశ్.. నువ్వు చదువుకున్నావా? బుద్ధి, జ్ఞానం, సంస్కారం ఉండే మాట్లాడుతున్నావా? తాగి మాట్లాడావా? నీ భార్యకు, అత్తకు, బంధువులకు హైదరాబాద్‌లో ఇండ్లు, ఆస్తులు లేవా? హైదరాబాద్‌లో మీరు పన్నులు కట్టడం లేదా? ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులను కూడబెట్టుకున్నది ఎవరు? ఇక్కడ సొంత ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకొని విజయవాడలో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం ? పోసాని కృష్ణ‌ముర‌ళి అంటే అంద‌రూ మెంట‌ల్ కృష్ణ అని అంటుంటారు.

ఎలా ఉండాలో కేసీఆర్ ను చూసి నేర్చుకోండి

నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా ? చ‌ంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌లేదా ? ప‌్ర‌జ‌ల‌తో ఎలా ఉండాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను చూసి నేర్చుకోండి అని ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అన్నారు. నాకు వ‌చ్చిన నంది అవార్డును తీసుకోన‌ని, వాటిని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ప్ర‌క‌టించాల‌ని అన్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి అవార్డులు వ‌చ్చాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని, నందుల‌తో ప్రాంతాల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తారా ? అని పోసాని ప్ర‌శ్నించారు. కావాలంటే లోకేష్ పేరిట బంగారు నంది అవార్డులు ఇచ్చుకోండ‌ని అన్నారు. ఇలాంటి వివాదాలు వ‌స్తే తాను చ‌చ్చే వ‌ర‌కు నంది

కోటీశ్వ‌రులు కానీ కూటికి లేదు

నగరంలో జీహెచ్‌ఎంసీ, జైళ్ల శాఖ చేపట్టిన బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భిక్షాటన చేసే వారిని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఆనంద్ ఆశ్రమాలకు తరలించి.. వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరి మహిళల కథ ఆశ్చర్యపరిచింది. ఒకరు అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ అయితే.. మరొకరు కోటిశ్వర్లు. వీరిద్దరిది కన్నీటి గాథ వింటే చలించిపోవాల్సిందే. హైదరాబాద్ ఆనంద్‌బాగ్‌లో నివాసముండే ఫర్జానా(50) ఎంబీఏ చదివింది. ఒకప్పుడు లండన్‌లో అకౌంట్స్ అధికారిణిగా పని చేసింది. రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో కుమారుడి దగ్గర ఉంటోంది. కుమారుడు వృత్తి రీత్యా ఆర్కిటెక్చర్. ఇటీవలే

పాల‌పిట్ట పార్క్ ప్రారంభ‌మ‌యింది

కొత్తగూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్‌ గార్డెన్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన పాలపిట్ట పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్క్‌ వద్ద కాలుష్య వాతావరణం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక‌ప్పుడు పిచ్చిమొక్క‌ల‌తో ఉన్న ఈ ప్రాంతాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు. హరిత‌హారంలో భాగంగా ఏడు వేల మొక్క‌లు నాటారు. సైక్లింగ్‌ కోసం వచ్చే వారికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 230 కొత్త సైకిళ్లు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం విశాలమైన సైకిల్‌ స్టాండ్‌ నిర్మించారు. రోజూ ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం 4-6 గంటల

కొండెక్కిన కోడిగుడ్డు

సాధార‌ణంగా ఎప్పుడూ కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెర‌గుతుంటాయి. కానీ ఈ సారి కోడిగుడ్ల ధ‌ర‌లు మండిపోతున్నాయి. ఒకప్పుడు రూ. 2 ఉన్న కోడిగుడ్డు మెల్లిగా రూ.4 అయింది. ఇప్పుడు ఏకంగా 40 నుండి 80 శాతం ధ‌ర‌లు పెరిగి ఏకంగా ఏడు రూపాయ‌లు ఇప్పుడు రూ.7.50 కి చేరుకుంది. జీఎస్టీ ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం అని పౌల్ట్రీ ఫెడ‌రేష‌న్ చెబుతుంది. గుడ్ల ఉత్పత్తి ఈ ఏడాదిలో 25-30 శాతం తగ్గిపోనుందని చెప్పారు. గతేడాది సరియైన రేట్లు లభించకపోవడంతో చాలా ఫౌల్ట్రీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయని, దీంతో ఈ ఏడాది రేట్లు పెరిగాయ‌ని అంటున్నారు. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి

కాలిఫోర్నియాలో తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు శనివారం కాలిఫోర్నియా లో ని బే ఏరియా లో నిర్వహించారు. విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సన్నాహక సదస్సు కు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు

చెప్ప‌డం కాదు .. చేసి చూపిస్తాం

మాట‌లు చెప్పిన ప్ర‌భుత్వాల‌ను చూశారు. కానీ మాది అలాంటి ప్ర‌భుత్వం కాదు. చెప్ప‌డ‌మే కాదు .. చేసి చూపించే ప్ర‌భుత్వం. నేత‌న్న‌ల‌ను ప‌ట్టించుకోని ప్ర‌భుత్వాల‌ను చూశారు. కానీ ఈ ప్ర‌భుత్వం వారిని అలా వ‌దిలేయ‌లేదు. నేత‌న్న‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో ప‌థ‌కాలు తీసుకువ‌స్తున్నాం. ఉద్య‌మ‌నేత‌గా ఉన్న‌ప్ప‌టి నుండి నేత‌న్న‌ల గురించి స్పందిస్తున్న కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక వారి జీవితాలు బాగుప‌డేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకున్నార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగించారు. నూలు, రంగులు, రసాయనాలపై 40% సబ్సిడీ ఇచ్చే ప్రతిష్ఠాత్మక చేనేతమిత్ర పథకాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఒక్క వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే

భార‌మైనా భ‌రిస్తాం

వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రంటు అందించేందుకు ప్ర‌భుత్వం ఎంత‌టి భారాన్ని అయినా భ‌రిస్తుంది. వ్య‌వ‌సాయానికి విద్యుత్ స‌బ్సిడీలు ఇవ్వడాన్ని ఆర్థిక‌వేత్త‌లు వ్య‌తిరేకిస్తున్నారు. కానీ నాకు ఆ ఆలోచ‌న లేదు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందించడంకోసం ప్రభుత్వ సబ్సిడీని రూ.4777 కోట్ల నుంచి రూ.5400 కోట్లకు పెంచుతున్నాం. అవసరమైతే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికీ సిద్ధం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే దాదాపు రూ.10 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల వల్ల ఏటా రూ.లక్ష కోట్ల విలువైన వ్యవసాయోత్పత్తులు వస్తాయి. అప్పుడు

గిరిజ‌నుల‌కు కేసీఆర్ వ‌రాలు

విద్యుత్ విజిలెన్స్ కేసులు మాఫీ. 70 కోట్ల విద్యుత్ బ‌కాయిలు మాఫీ. గొర్రెల యూనిట్లు ఇచ్చేందుకు నిర్ణ‌యం. ప్ర‌తి తండాకు ర‌హ‌దారి. రూ.125కు విద్యుత్ క‌నెక్ష‌న్. 50 యూనిట్ల లోపు విద్యుత్ కు ఎలాంటి ఛార్జ్ లేదు. ప్ర‌తి ఇంటికి స‌ర్వీస్ వైరు. ఇంటిలోప‌ల వైరింగ్ తో పాటు రెండు లైట్ల ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గిరిజ‌నుల‌కు వ‌రాలు ప్ర‌క‌టించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా 8,734 ఆవాసాల్లో త్రీఫేజ్ కరంటు లేదని.. సమైక్యరాష్ట్రంలో నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ అని, ప్రతి ఎస్టీ ఇంటికి, ఎస్టీ వ్యవసాయదారుడికి, ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు విద్యుత్ కనెక్షన్ కల్పించనున్నట్టు ముఖ్య‌మంత్రి