టాలీవుడ్‌లో స‌త్తుకాలం సంగీతం!

0 1789

తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గొప్ప‌వాళ్లు. అస‌లు ఏ విష‌యం లేని సినిమాలు తీసినా ఒక్కోసారి సూప‌ర్‌హిట్ చేసేస్తారు. ఆ కోవ‌లో మ‌న సినిమాల్లో విష‌యం లేనివి కూడా కొన్ని బ‌తికిపోతున్నాయ్‌. హీరో ఇమేజ్‌తోనే మ‌రికొన్ని సినిమాలు ఆడేస్తున్న సంద‌ర్భాల్ని కాద‌న‌లేం. అయితే అదేం ద‌రిద్ర‌మో తెలుగు సినిమాల్లో సంగీతం ఎప్పుడూ ఒకేలా వినిపిస్తుంది. ట్యూన్‌లో క్రియేటివిటీ అనేది టార్చి వేసి వెతికినా క‌నిపించ‌దు. ఎప్పుడు చూసినా అవే బాణీలు. వినిపించిన వాటినే వినిపించి చంపేస్తున్నారు. న‌వ‌త‌రం సంగీత ద‌ర్శ‌కులు సైతం ఏమైనా పీకారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ అదే కొట్టుడు. డ‌బ్బాలు, కుండ పెంకుల‌పైనే అద్భుత‌మైన మ్యూజిక్‌ని వినిపించారు స్వ‌ర‌జ్ఞాని ఇళ‌య‌రాజా. ఆ రోజుల్లో ఏ టెక్నాల‌జీ అందుబాటులో లేక‌పోయినా శ్రావ్య‌మైన సంగీతాన్ని వినిపించారు. ఇటీవ‌లి కాలంలో సంగీతం అంటేనే పెద్ద రోత అయిపోయింది. రాత్రికి రాత్రే ట్యూన్ క‌ట్టేస్తారు. మందేసిన‌ప్పుడో చిందేసేప్పుడో ఐడియా వ‌చ్చింది. దాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెంట‌నే ఓకే చేసేశార‌ని చెప్పే సంగీత ద‌ర్శ‌కులే మ‌న‌కు ఎక్కువ‌. ఇళ‌య‌రాజా త‌ర్వాత మ‌ళ్లీ బాణీలో కొత్త‌ద‌నం, క్రియేటివిటీ చూపించింది ఏ.ఆర్‌.రెహ‌మాన్ మాత్ర‌మే. యువ‌న్ శంక‌ర్ రాజా, హారిస్ జైరాజ్ లంటి కొద్ది మంది సంగీత ద‌ర్శ‌కులు మాత్ర‌మే సిస‌లైన సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగులో చాలామంది సంగీత ద‌ర్శ‌కులు ఉన్నా కేవ‌లం పార్ట్ టైమ‌ర్స్ లాగా కొన్నాళ్లు మాత్ర‌మే వాళ్ల ప్ర‌భ‌. కీర‌వాణి, మ‌ణిశ‌ర్మ, దేవీశ్రీ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ సంగీత ద‌ర్శ‌కులే లేక‌పోవ‌డం అవ‌మాన‌క‌రం. త‌మ‌న్‌, అనూప్ రూబెన్స్ , శేఖ‌ర్ చంద్ర వంటివాళ్ల సంగీతం ఇప్ప‌టికే పాత‌బ‌డిపోయింది. వినిపించిన బాణీల్నే తిప్పి తిప్పి వినిపించ‌డం వీళ్ల‌కు అల‌వాటైపోయింది. ఇలాంటివాట‌న్నిటినీ భ‌రించేసే ఓపిక తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప వేరే ఏ ఇత‌ర భాష‌ల వాళ్ల‌కు ఉండ‌దు.

NO COMMENTS

Leave a Reply