అడిగాడో లేదో.. వీహెచ్ కు షాకిచ్చిన కేసీఆర్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఊహించ‌ని షాక్ ఇచ్చారు. కేసీఆర్ ఎవ‌రికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వీహెచ్ వ్య‌వ‌హారం స‌మాధానంగా నిలుస్తుంది అన‌డంలో సందేహం లేదు. టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మ‌న‌వ‌డి వివాహ వేడుక‌కు వ‌చ్చిన కేసీఆర్ ను వీహెచ్ క‌లిశారు. సీఎం సాబ్ మీరు మాకు క‌ల‌వ‌డానికి అస్స‌లు టైం ఇవ్వ‌డం లేదు అని అన్నారు.

వెంట‌నే కేసీఆర్ ‘ఇంటికి పోదాం పద, హన్మంతన్నాస అని అన్నారు. ముఖ్య‌మంత్రి కాన్వాయ్ లోని ఓ కారులో ఎక్కి వీహెచ్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు వెళ్లారు. 40 నిమిషాల సేపు ముఖ్య‌మంత్రితో ఉన్న వీహెచ్ ఆ త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి బ‌తుక‌మ్మ‌కుంట‌ను ప‌రిర‌క్షించాల‌ని, అంబ‌ర్ పేట‌లో మ‌హాత్మా జ్యోతీరావు పూలే ఆడిటోరియం నిర్మించాల‌ని, హ‌నుమాన్ వ్యాయామ‌శాల ఏర్పాటు చేయాల‌ని కోరాన‌ని, ముఖ్య‌మంత్రి వెంట‌నే బ‌తుక‌మ్మ‌కుంట గురించి అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తో మాట్లాడార‌ని, ఆయ‌న స్పందించిన తీరు, ఇచ్చిన హామీలు ఎంతో సంతోషం అనిపించాయ‌ని అన్నారు. తాను మీడియేట‌ర్ల‌ను .. మీడియాను న‌మ్ముకోలేద‌ని, జ‌న‌హిత‌లో వారానికి రెండు సార్లు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తాన‌ని, ఏ స‌మ‌స్య అయినా ప్ర‌జ‌లు నేరుగా త‌న‌కే తెలిపేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని కేసీఆర్ చెప్పార‌ని వీహెచ్ అన్నారు.  మొత్తానికి హ‌న్మంత‌న్న కేసీఆర్ స్పంద‌న‌తో ఖుషీ అయ్యారు.

NO COMMENTS

Leave a Reply