ఉప రాష్ట్ర‌ప‌తి : వెంక‌య్య‌పై వేటు ఖాయ‌మా ?

venkaiah naidu with narendra modi

కాబోయే రాష్ట్ర‌ప‌తి బీజేపీ సీనియ‌ర్ నేత అద్వానీ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ పార్టీని దేశంలో నిల‌బెట్టిన వ్య‌క్తిగా ప్ర‌ధాని కావాల్సిన అద్వానీకి ఇప్ప‌టి వ‌ర‌కు అదృష్టం క‌లిసిరాలేదు. ఇక మోడీ ప్ర‌ధాని అయ్యాక అద్వానీ క‌నుమ‌రుగు అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఖ‌చ్చితంగా రాష్ట్ర‌ప‌తిని చేస్తారు అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఉప రాష్ట్ర‌ప‌తి ఎవ‌రు అవుతారు ? అన్న చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. కాంగ్రెస్ పాల‌న జోరుగా సాగిన‌ప్పుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న‌వారు రాష్ట్ర‌ప‌తి అవ‌డం ఆన‌వాయితీగా ఉండేది. అయితే వాజ్ పేయి హయాంలో అబ్దుల్ క‌లాంను రాష్ట్ర‌ప‌తిని చేశాక ఆ ఆన‌వాయితీ త‌ప్పింది.

ఇక ద‌క్షిణాదికి ఉప‌రాష్ట్ర‌ప‌తి అయ్యే అవ‌కాశం ఇచ్చేవారు. అయితే కేఆర్ నారాయ‌ణ‌న్ త‌రువాత గ‌త 11 ఏళ్లుగా ఆ అవ‌కాశ‌మూ ద‌క్క‌డం లేదు. అయితే కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడును ఉప రాష్ట్ర‌ప‌తిని చేస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వెంక‌య్య‌ను కేంద్రం నుండి త‌ప్పించేందుకు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి సిఫార్సు చేస్తున్నార‌ని అంటున్నారు. మోడీకి – వెంక‌య్య‌కు బెడిసింద‌ని, అందుకే తిరుప‌తిలో జ‌రిగిన సైన్స్ కాంగ్రెస్ కు ప్ర‌ధాని వ‌చ్చినా హాజ‌రుకాలేద‌ని అంటున్నారు. చంద్ర‌బాబును ప్ర‌తీ స‌మావేశంలో పొగ‌డ‌డం వెన‌క కూడా ఏదో కార‌ణం ఉంద‌ని అంటున్నారు. మ‌రి వెంక‌య్య ప‌రిస్థితి ఏమ‌వుతుందో వేచిచూడాలి.

NO COMMENTS

Leave a Reply