నాగ‌బాబుకు చుక్క‌లు చూయిస్తున్న వ‌ర్మ‌

VARMA

‘‘నాగబాబు సార్‌.. అక్కుపక్షులపై దృష్టి పెట్టి సమయం వృథా చేయడం కన్నా మీ సోదరులను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి పెడితే మంచింది. లేకుంటే తమరు రోడ్డుపై ఉండాల్సి ఉంటుంది. నేను డైరెక్ట‌ర్ గా ఉండ‌డం మూలంగా నా మీద చాలా కుటుంబాలు ఆధార‌ప‌డి జీవిస్తున్నాయి. నీ కెరీర్ నీ సోద‌రుల కుటుంబాల మీద ఆధార‌ప‌డి న‌డుస్తోంది’’ అని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు మీద ట్విట్ట‌ర్ ఎటాక్ మొద‌లు పెట్టాడు. ఖైదీ నంబ‌ర్ 150 ప్రీ రివ్యూ వేడుక‌లో చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మీద విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ట్విట్ట‌ర్ లో స్పందించాడు.

మొద‌ట రాంగోపాల్ వ‌ర్మ అకౌంట్ నుండి చిరంజీవికి క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ట్వీట్ వ‌చ్చింది. త‌న అకౌంట్ ను ఎవ‌రో ఇడియ‌ట్ హ్యాక్ చేసి పోస్ట్ చేశార‌ని, తాను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేద‌ని వ‌ర్మ ట్వీట్ చేశాడు. నేను తెలుగులో ట్వీట్ చేయ‌ను .. నీకు ఇంగ్లీష్ రాదు కాబ‌ట్టి ఎవ‌రిన‌యినా అడిగి నా ట్వీట్ అర్ధాలు తెలుసుకోవాల‌ని వ‌ర్మ నాగ‌బాబుకు సూచించాడు.

‘ఇప్పుడే ఖైదీనెం.150 ట్రైలర్‌ చూశాను. అది అవతార్‌ సినిమా కన్నా చా….లా అద్భుతంగా ఉంది’ అని వర్మ ఇంకో ట్వీట్ లో ఎద్దేవా చేశాడు. చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ పెట్టమని తప్పుడు సలహా ఇచ్చి ఆయన ఓటమికి కారణం అయిన నాగ‌బాబు గురించి అంద‌రికీ తెలుస‌ని .. ‘నేనేం చేయాలో సలహా ఇచ్చే ముందు, ఎలాంటి జీవం లేని మీ ‘జబర్ధస్త్‌’ కెరీర్‌ గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, చిరంజీవికి ఉన్న గొప్పతనంలో నాగబాబుకు 0.1% కూడా లేదని’ వ‌ర్మ ఇంకో ట్వీట్ లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం..

NO COMMENTS

Leave a Reply