నాగ‌బాబు ఫీల‌యిన‌ట్లున్నాడు !

VARMA

‘‘నేను నా స్ట‌యిల్ లో అంద‌రిమీద ఏదో ఓ విధంగా స్పందిస్తా .. నా అభిప్రాయం ఏదో చెబుతా .. మోడీ నుండి అమితాబ్ వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌ను. అయితే నా మాట‌ల‌కు నాగ‌బాబు హ‌ర్ట్ అయిన‌ట్లుంది. మీరు ట్విట్ట‌ర్ లో లేరు. అయితే ట్వీట్లు ఎవ‌రో మీకు చూపుతున్న‌ట్లుంది. మీరంటే నాకు ఇష్టం. నేను మ‌న‌స్ఫూర్థిగా మీకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. నా ఉద్దేశం వేర‌యినా హ‌ర్ట్ అయ్యారు కాబ‌ట్టి మీ కుటుంబానికి .. చిరంజీవికి కూడా నా త‌ర‌పున క్ష‌మాప‌ణ‌లు చెప్పండి’’ అని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో కొద్దిసేప‌టి క్రితం నాగ‌బాబును ఉద్దేశించి ట్వీట్ చేశాడు.
చిరంజీవి నటించిన 150 సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో వ‌ర్మ మీద నాగ‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించిన నేప‌థ్యంలో రాంగోపాల్ వ‌ర్మ స్పందించాడు.

NO COMMENTS

Leave a Reply