టీఎస్ పీఎస్సీలో ఆంధ్రా ఉద్యోగుల దాష్టీకం

ts

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ వింగ్ సమావేశ మందిరంలోకి ఆంధ్రా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు చెందిన ఆంధ్రా ఉద్యోగులు దౌర్జన్యంగా చొరబడ్డారు. అక్కడ సమావేశం నడుస్తుండగానే తమ డాక్యుమెంట్లు ఉన్నాయి అంటూ తెలంగాణ ఉద్యోగుల మీద దౌర్జన్యం చేసి పలు కీలక డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. ఆంధ్రా ఉద్యోగుల తీరుపట్ల తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతిలేకుండా కార్యాలయంలోకి రావడం .. అది తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక సమావేశం జరుగుతున్న సమయంలో రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో జరిగిన నియామాలకు సంబంధించిన ఫైళ్లు ఇందులో ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి తీసుకవెళ్లొచ్చు. దాని సాధ్యాసాధ్యాలను బట్టి ఆ ఫైళ్లను అందజేస్తాం. కానీ ఇలా దౌర్జన్యంగా రావడం ఏంటని తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకూ ఆంధ్రా ఉద్యోగుల ఆగడాలు పెరుగుతున్నాయని .. తీరు మార్చుకోకుంటే ఎదురుదాడి తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంత దౌర్జన్యంగా లాక్కెల్లాల్సిన కీలకపత్రాలు ఏంటి ? గతంలో జరిగిన నియామకాలకు సంబంధించి అవకతవకలు బయటకు రాకుండా ఆ ఫైళ్లను ఎత్తుకెళ్లారా ? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

2 COMMENTS

  1. Vaddu vacchi theesukelthunte mana vallu em chessaru… ?last time sagar dhaggara kuda vacchi dhorjanyanga talalu theesukoni poyi gate lu open chesi neellu pampinchukunnappudu ilanti news chusaanu.

    chusthu kurchunte ilanti news vathayi.okkasari edhru tirigi thante inkosaari raavvadaaniki bayapadathadu

  2. This indicates the inefficiency of the T-Employees from entering the Andhra Employees without permission in the confidential meeting. They can as well report ot Police for this and suitable action can be initiated or they can as well go the Court for such illegal activities of Andhra Employees. Or this may give impression that the T-Employees themselves are indirectly supporting the Andhra Employees for ding so by taking bribes.

Leave a Reply