హైద‌రాబాద్ ప్ర‌పంచంలో టాప్ 5 !

hyd

హైద‌రాబాద్ కీర్తి కిరీటంలో మ‌రో క‌లికితురాయి వ‌చ్చిచేరింది. ప్ర‌పంచంలోని అత్యంత ప్ర‌భావ‌వంత‌మ‌యిన న‌గ‌రాల‌లో అయిద‌వ‌స్థానాన్ని హైద‌రాబాద్ ద‌క్కించుకుంది. జనాభా, కనెక్టివిటీ, టెక్నాలజీ, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, విద్య, ఆర్థిక ఫలితాలు, కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఆస్తుల విలువ వంటి 42 అంశాలను ఆధారం చేసుకుని జేఎల్‌ఎల్ కన్సల్టెన్సీ తన వార్షిక నగరాల పురోగతి సూచిక (సీఎంఐ)ను విడుదల చేసింది.

వీటి ఆధారంగా ఎంపిక చేసిన న‌గ‌రాల‌లో మొద‌టి స్థానం బెంగుళూరుకు ద‌క్క‌గా రెండో స్థానాన్ని వియత్నాంలోని హోచిమిన్ సిటీ, మూడో స్థానంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నాలుగో స్థానంలో చైనాలోని షాంఘై నిలిచాయి. లండన్ (బ్రిటన్), హనోయ్ (వియత్నాం), ఆస్టిన్ (అమెరికా), బోస్టన్ (అమెరికా), నైరోబీ (కెన్యా) తదుపరి స్థానాలు పొందాయి. గ‌త రెండున్న‌రేళ్ల కృషి ఫ‌లితంగా ఈ స్థానం ద‌క్కింద‌ని, వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మ‌స్థానం ద‌క్కించుకునేందుకు కృషి చేద్దామ‌ని హైద‌రాబాద్ న‌గ‌ర క‌మీష‌న‌ర్ జ‌నార్ధ‌న్ రెడ్డి, హెచ్ఎండీఎ క‌మీష‌న‌ర్ చిరంజీవులు, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ లు అన్నారు.

NO COMMENTS

Leave a Reply