ట్విట్ట‌ర్ కోడి మీడియా ముందుకు !

pawan-with-book

గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో ఆంధ్రాకు ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ గొంతు చించుకుని కూస్తున్న ట్విట్ట‌ర్ కోడి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస‌లు రోజు చేతులెత్తేసి విశాఖ‌కు వెళ్ల‌కుండా హాయిగా షూటింగ్ చేసుకున్నాడు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరు మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. యువ‌త‌ను ట్వీట్ల‌తో రెచ్చ‌గొట్టి తాను ఎందుకు వెళ్ల‌లేద‌ని అంతా ప్ర‌శ్నించారు.

నిన్న విశాఖప‌ట్నంలో ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టులు జ‌రుగుతుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నిస్తూ ఉండిపోయాడు. రాత్రికి విశాఖ‌లో జ‌గ‌న్ ను అడ్డుకుని వెన‌క్కు పంప‌డం .. ఎక్క‌డిక‌క్క‌డ యువ‌త‌ను, ఇత‌ర నేత‌ల‌ను అరెస్టు చేయ‌డం, లాఠీఛార్జ్ చేయ‌డంతో ప‌వ‌న్ తీరుమీద విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఈ రోజు మీడియా ముందుకు వస్తున్నాన‌ని మ‌రో ట్వీట్ వేశాడు. ఈ మీడియా మీట్ లో ఎన్ని సార్లు ఊగిపోతాడో వేచిచూడాలి.

NO COMMENTS

Leave a Reply