రైతులొప్పుకుంటే రెఢీ అంటున్న కేసీఆర్

kcr6

నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని తెరిపించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం సిద్దంగా ఉంది. రైతులు సొసైటీగా ఏర్ప‌డి ముందుకు వ‌స్తే ఫ్యాక్ట‌రీని వెంట‌నే తెరిపిస్తాం. ఫ్యాక్ట‌రీని టేకోవ‌ర్ చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం సిద్దం. అయితే దానిని తెరిపించ‌డ‌మే కాదు .. దానికి త‌గినంత చెరుకును కూడా పండించాలి అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. బోధన్ ఫ్యాక్టరీ పరిధిలోని 95 శాతం మంది రైతులు చెరుకు పంట వేయడం లేదు. నిజాం షుగర్స్ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయాలంటే 10 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు అవసరం ఉంటుంది అని తెలిపారు.

నేను స్వ‌యంగా రైతును .. నాకు రైతుల క‌ష్టాలు తెలుసు. ప‌దేళ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఫ్యాక్ట‌రీ తెరిపించ‌లేక‌పోయింది. మహారాష్ట్రలో 100 నుంచి 130 టన్నుల చెరుకు ఉత్పత్తి చేస్తున్నరు. మహారాష్ట్రలోని చెరుకు సాగును అధ్యయనం చేసేందుకు 400 మంది రైతులను పంపించినం. ఆ ఫ్యాక్ట‌రీ ప‌రిధిలోని శాస‌న‌స‌భ్యులు, రైతులు స‌మావేశం పెట్టుకుని సొసైటీగా ఏర్ప‌డి ప్ర‌భుత్వానికి వివ‌రాలు అందించి చెరుకు పంట సాగుకు సిద్దం అయితే ఫ్యాక్ట‌రీని తెలిపించ‌డానికి సిద్దం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

NO COMMENTS

Leave a Reply