లండన్ లో అట్టహాసంగా టాక్ (TAUK) ఆవిర్భావం

tak

లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు విశిష్ట అతిధులుగా ప్రముఖ తెలంగాణ కవి నందిని సిద్దారెడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, నిజాం నవాబ్ మనువడు ప్రిన్స్ మోహిషిన్అలీఖాన్, భారత హై కమిషన్ సెక్రటరీ విజయ్ బి వసంత్ విచ్చేశారు. యుకె నలుమూలల నుండి తెలంగాణ బిడ్డలు, ప్రవాస భారతీయులు, అభిమానులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు .

మొదటగా గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారత హై కమిషన్ సెక్రటరీ విజయ్ బి వసంత్ పతాక ఆవిష్కరణ చేసారు. ఆ తర్వాత జోతి ప్రజ్వలన గావించి అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు, దాని తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిని అలరించారు.

నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ విదేశాలలో వుంటూ తమ మాతృ భూమి గురించి ఆలోచిస్తూ, తెలంగాణ అస్తిత్వాలను కాపాడుతూ తెలంగాణ ఎన్ అర్ ఐ లు పోషిస్తున్న పాత్ర ఎనలేనిది అన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎన్ అర్ ఐ లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్బంగా కట్టా శేఖర్ రెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ “టాక్” కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్ల వేళల నమస్తే తెలంగాణ ముందు ఉంటుందని తెలిపారు.

నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడుతూ ‘తెలంగాణ’ ఉద్యమంలో ప్రస్తుత టాక్ సభ్యులు కీలక పాత్ర పోశించారని, బతుకమ్మ మరియు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన అనుభవగ్యులని, తెలంగాణ కీర్తిని సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. అదే స్ఫూర్తి అనుభవం తో నూతన సంస్థ టాక్ ద్వారా మరింత బాధ్యత తో ముందుకు వెళ్లాలని తెలిపారు. తెలంగాణా సాహిత్యాన్ని పరిరక్షించే దిశగా కృషి చేయాలనీ టాక్ సభ్యులకు సూచించారు.

ఇండియన్ హై కమిషన్ సెక్రటరీ విజయ్ బి వసంత్ ప్రసంగిస్తూ, భారతీయతే మనకు ప్రధమం అనే సందేశాన్ని తీసుకెళ్లే దిశగా నేడు ‘టాక్’ సంస్థ ఆవిర్భావ వేడుకల సందర్బంగా ముందు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకం ఎగరవేసుకోవడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది, ఈ సందర్బంగా టాక్ కార్యవర్గాన్ని అభినందించారు

తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ‘తెలంగాణ’ సంస్కృతిని కాపాడటం హర్షదాయకం అన్నారు. టాక్ సంస్థ కు భారత హై కమీషన్ అన్ని రకాల సహాయ సహకారాలందింస్తుందని హామీ ఇచ్చారు.

నిజాం వంశస్థుడు ప్రిన్స్ మోహిషిన్ అలీఖాన్ ఉపన్యసిస్తూ తెలంగాణ కు చెందిన కుటుంబ సభ్యులందరినీ ఒకే దగ్గర కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, లండన్ వచ్చి ఎన్నో సంవత్సరాలైనా హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టాక్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.

టాక్ వ్యవస్థాపకులు మరియు ఎన్నారై టి.ఆర్.యస్ యుకె అధ్యక్షుడు, ఎన్ అర్ ఐ ల లో కీలక పాత్ర పోషిస్తున్న అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతోనే మన కర్తవ్యం పూర్తయినట్లు కాదని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమందరం బాధ్యత వహించాలని కోరారు.

అనిల్ కూర్మాచలం తన ఉద్వేగ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో లండన్ నగరంలోని గల్లీ, గల్లీలో తెలంగాణ జెండా మోసి, రాష్ట్రం ఏర్పాటు అయ్యేవరకు పోరాటం చేసిన ఎంతో మంది ఉద్యమ బిడ్డలతో కలిసి నేడు నూతన సంస్థగా ఏర్పడడం గర్వాంగా ఉందని తెలిపారు. టాక్ ఆశయాలను సభకు వివరించారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం మన చారిత్రక ఆవరసరం అన్నారు.

టాక్ సంస్థను ముందుకు తీసుకెళ్లే అధ్యక్ష బాధ్యతలు పవిత్ర కంది నిర్వహిస్తారని, అడ్వైసరి బోర్డు చెర్మైన్ గా గోపాల్ మేకల వ్యవహరిస్తారని ప్రకటించారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్రా రెడ్డి ప్రసంగిస్తూ టాక్ దిశా, నిర్దేశాలను , టాక్ పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వం వెంట ఉంటామని తెలిపారు.

అతిధులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు,అలాగే హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులకు, సహకరించిన ప్రముఖులకు సంస్థ జ్ఞాపికను అందించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సుమా దేవి వ్యవరించారు. కార్యక్రమంలో వ్యవస్థాపకులు మరియు ఎన్నారై టి.ఆర్.యస్ యుకె అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం . అధ్యక్షురాలు పవిత్రా రెడ్డి,అడ్వైసరి బోర్డు చెర్మైన్ గోపాల్ మేకల సభ్యులు స్వాతి బుడగం, శ్రీకాంత్ పెద్దిరాజు, మట్టారెడ్డి, స్నేహ లత కటారు, శ్రీకాంత్ జెల్ల, శ్రీనివాస్ రావు సుందరగిరి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ మేకల , రంజిత్ , సుప్రజ పులుసు, జాన్వీ వేముల, శ్రీ శ్రావ్య, వంశీ చైతన్య,ప్రవళిక భువనగిరి, నవీన్ రెడ్డి , రత్నాకర్ , అశోక్ ,వెంకట్ రెడ్డి , విక్రమ్ రెడ్డి , మల్లారెడ్డి , సంజయ్ ,సత్యపాల్ , సత్య ,రవి ప్రదీప్ పులుసు, సుమాదేవి,సురేష్ బుడగం,నవీన్ భువనగిరి, శ్రీధర్ రావు,రాజేష్,సత్యం కంది , గణేష్ పాస్తం, మధుసూదన్ రెడ్డి, రవి రతినేని ,నరేంద్ర బాబు కటారు, ప్రవీణ్ కుమార్ వీరా,సతీష్ పాల్గొన్నవారిలో ఉన్నారు.

tak1 tak2 tak3 tak4 tak5

NO COMMENTS

Leave a Reply