టీడీపీ ఏడ మిగిలింద‌ని పొత్తు

talasani2

తెలంగాణ టీడీపీలో ఏముంద‌ని, ఎక్క‌డ మిగిలింద‌ని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటార‌ని రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ – టీడీపీ పొత్తు అని ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు స్పందించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది తానే నని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, విపక్ష నేతలు దొంగల్లా రాత్రి పూట మాట్లాడుకుంటున్నారని త‌ల‌సాని ఎద్దేవా చేశారు. తెలంగాణ జేఏసీ నేత కోదండరాం రాత్రికి రాత్నే అన్ని జరిగిపోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసం ఉద్యోగాలు భర్తీ చేస్తారని తెలియదా?, యువకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.

NO COMMENTS

Leave a Reply