“శ‌్రీమంతుడు: సినిమా రివ్యూ

srimanthudu-movie-reviewన‌టీన‌టులు: మ‌హేష్‌బాబు, శృతిహాస‌న్‌, పూర్ణ‌, జ‌గ‌ప‌తిబాబు, సుక‌న్య‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌
సంగీతం: దేవిశ్రీప్ర‌సాద్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ది
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి, మోహ‌న్ చెరుకూరి
క‌థ‌- స్ర్కీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌
రిలీజ్ డేట్‌: 07 ఆగ‌స్టు, 2015
దూకుడు, బిజినెస్‌మేన్‌, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాల‌తో మ‌హేష్‌కు టాలీవుడ్‌లో ఎదురు లేకుండా పోయింది. వ‌న్ నిరాశ‌ప‌ర్చినా మేథావుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇక ఆగ‌డు మానియా చూస్తే టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరే తొలి సినిమా అవుతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. అయితే ఆ సినిమా మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు ప్రిన్స్‌ను కూడా తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఈ సారి మిర్చి త‌ర్వాత రెండో సినిమా చేస్తున్న కొత్త డైరెక్ట‌ర్  కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో చేసిన చిత్రం శ్రీమంతుడు. విడుద‌ల‌కు ముందు  నుంచే కొత్త కాన్సెఫ్ట్ అంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో పాటు శృతి ప్రిన్స్‌కు జోడీ క‌ట్ట‌డం..దేవిశ్రీ ఆడియోతో శ్రీమంతుడుకు మంచి బ‌జ్ వ‌చ్చేసింది. ఈ బ‌జ్‌కు త‌గ్గ‌ట్టే మ‌హేష్ శ్రీమంతుడ‌య్యాడా లేదా చూద్దాం.
స్టోరీ:
శ్రీమంతుడి లాంటి ఫ్యామిలీ ఓన‌ర్ ర‌వికాంత్ (జ‌గ‌ప‌తిబాబు) కుమారుడు హ‌ర్ష (మ‌హేష్‌). కోట్ల‌కు ప‌డ‌గలెత్తడంతో.. హ‌ర్ష ఆస్తులు కూడ‌బెట్టుకోవ‌డం క‌న్నా తోటివారికి సాయం చేయ‌డం, క‌ష్టాల్లో ఉన్న‌వారికి హెల్ఫ్ చేస్తుంటాడు. ఓ రోజు కారులో వెళుతూ చారుశీల (శృతిహాస‌న్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. హ‌ర్ష ఆమెకు త‌న ల‌వ్ గురించి చెప్పినా రిజ‌క్ట్ చేసి ఓ కార‌ణం కూడా చెపుతుంది. ఆమె ద్వారా ఓ గ్రామం గురించి తెలుసుకున్న హ‌ర్ష ఉత్త‌రాంధ్ర‌లోని దేవ‌ర‌కోట అనే గ్రామం వెళ్లి ఆ ఊరిని ద‌త్త‌త తీసుకుంటాడు. ఆ ఊరిని అభివృద్ధి చేస్తే త‌మ పెత్త‌నం పోతుంద‌ని భావించిన సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ వెంక‌ట‌రత్నం (ముఖేష్‌రుషి), అత‌ని త‌మ్ముడు శ‌శి(సంప‌త్‌రాజ్‌), వెంక‌ట‌ర‌త్నం కొడుకు రాధ (హ‌రీష్‌) హ‌ర్ష‌ద్ ప‌నుల‌ను ఆపి అత‌డిని చంపాల‌నుకుని హ‌ర్ష‌పై ఎటాక్ చేస్తారు. హ‌ర్ష కోసం తండ్రి ర‌వికాంత్ ఆ ఊరెళ‌తాడు. హ‌ర్ష‌కు, చారుశీల‌కు  ఆ ఊరికి సంబంధం ఏమిటి ? ర‌వికాంత్ ఎందుకు క‌ఠిన మ‌న‌స్కుడిగా మారాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు హీరో త‌న లక్ష్యాన్ని ఎలా సాధించాడ‌న్న‌దే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ:
ఊరిని ద‌త్త‌త తీస‌కోవ‌డం అనే సోష‌ల్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీని తీసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల ఈ లైన్‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగులద్దాడు. తీసుకున్న క‌థ లైన్ కొత్త‌గానే ఉంది. ఈ క‌థ‌లో మ‌హేష్‌-శృతి మ‌ధ్య ల‌వ్‌ట్రాక్ వ‌ర‌కు బాగానే అల్లాడు. అక్క‌డ నుంచి మ‌ళ్లీ రొటీన్ ట్రాక్ బాట ప‌ట్టేసి మంచి ప‌నుల‌కు విల‌న్లు అడ్డుప‌డుతుంటే వారిని చావ చిత‌క్కొట్ట‌డంతో ముగించేశాడు. అయితే ప్రేక్ష‌కుల్ని మెప్పించే క్ర‌మంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. అయితే ఫ‌స్టాప్ వ‌ర‌కు టైం వేస్ట్ చేయకుండా మ‌హేష్ క్యారెక్ట‌ర్ ఎలాంటిదో తొంద‌ర‌గానే చెప్పేశాడు. త‌న‌కు సంతృప్తినిచ్చే ప‌నికోసం వెతుకుతున్న హీరో హీరోయిన్‌ను చూసి ల‌వ్‌లో ప‌డ‌డం…ఆమె ప్రేమ కోసం కాలేజ్‌కి వెళ్లి ఆమెను లైన్లో పెట్టేందుకు ట్రై చేయ‌డం..ఆమె హీరో ప్రేమ‌ను తిర‌స్క‌రించ‌డం..త‌ర్వాత దేవ‌ర‌కోట రావ‌డం వ‌ర‌కు సినిమా ఫాస్ట్‌గానే మూవ్ అవుతూ ముందుకు క‌దులుతుంది.
  సెకండాఫ్‌కు వ‌చ్చేస‌రికి ఊరిని ద‌త్త‌త తీసుకునేందుకు కొంత టైంను వేస్ట్ చేసినా యాక్టివిటిస్‌ను పాట‌లో ముగించేశాడు. గ్రామంలో డ‌వ‌ల‌పింగ్ యాక్టివిటిస్‌తో పాటు ఆ ఊరి ప్ర‌జ‌ల బాధ‌ల‌ను రిపీట్ చేయ‌డంతో అక్క‌డ మూవీ  ప్లో కాస్త స్లో అయ్యింది. ఇక సెకండాఫ్‌లో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ త‌ర్వాత ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేయాల్సి ఉండ‌గా అక్క‌డ ప‌ట్టు స‌డ‌లింది. సినిమాలో ప్ర‌జెంట్ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్లాన్ చేసుకోలేదు. ఆలీ, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హెల్ఫ్ కాలేదు. సెకండాఫ్‌లో సాగదీత త‌గ్గించి కాస్త ముందుగానే ఎండ్ ఇచ్చిఉంటే మ‌రింత స్పీడ్‌గా ఉండేది. సినిమా మొత్తం ఒకే న‌రేష‌న్‌లో ఉన్న‌ట్టు ఉంది.
        ఇక మ‌హేష్‌బాబు త‌న గ‌త సినిమాల‌కు భిన్నంగా శ్రీమంతుడులో నాలుగైదు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. తండ్రి మాట విన‌ని కొడుకుగా, ల‌క్ష్యం లేని యువ‌కుడిగా, హీరోయిన్ కోసం ప‌రిత‌పించే ప్రేమికుడిగా, ఊరి మంచి కోసం క‌ష్ట‌ప‌డే వ్య‌క్తిగా చివ‌ర‌కు తండ్రి చేత  మంచి కొడుకు అని పించుకునే కొడుకుగా న‌ట‌న‌లో ప‌లు యాంగిల్స్‌ను ప్రేక్ష‌కుడి మూడ్‌కు క‌నెక్ట్ అయ్యేలా న‌టించాడు. ఇక శృతిహాస‌న్ కాలేజ్ స్టూడెంట్‌గా, చివ‌ర్లో మ‌హేష్ కోసం త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేట‌ప్పుడు భావోద్వేగాల‌ను బాగా పండించింది. అన్నింటికి మించి మ‌హేష్‌-శృతి మ‌ధ్య వ‌చ్చే కాలేజ్ ఎపిసోడ్‌లో సీన్ల‌న్ని చాలా ఇంట్ర‌స్ట్ క‌లిగించాయి. ఈ వ‌య‌స్సులో కూడా మ‌హేష్ స్టూడెంట్‌గా చేసిన న‌ట‌న‌, శృతి అందాలు బాగున్నాయి. సినిమాకు జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్ పాత్ర‌లు రెండూ కీల‌క‌మే వారిద్ద‌రు అటు పెద్ద‌రికంలోను ఇటు ఎమోష‌న‌ల్‌గాను సూప‌ర్బ్ అనిపించారు. వీరికి స‌పోర్ట్‌గా సుక‌న్య‌, సితార పాత్ర‌లు బాగున్నాయి. విల‌న్లుగా చేసిన ముఖేష్‌రుషి, సంత‌ప్‌రాజ్‌, రాధల విల‌నిజం స్ర్టాంగ్‌గా డిజైన్ చేయ‌డంతో హీరోయిజం పండింది. మా మెంబర్స్‌కు స్పెష‌ల్  క్యారెక్ట‌ర్లు బాగా ఇచ్చారు.
  సాంకేతికంగా ఈ సినిమాకు ప్ర‌తి ఒక్క టెక్నిషియ‌న్ ఎఫ‌ర్ట్ పెట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ లో అటు ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం నుంచి సిటీ వ‌ర‌కు బాగా చూపించారు. పాట‌ల్లోను, మ‌హేష్‌-శృతి న‌టించిన సీన్ల‌లోను, ఆర్ట్ వ‌ర్క్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా ప్ర‌జెంట్ చేయ‌డంలో మ‌ది ప‌నితీరు ప్ర‌శంస‌నీయం. ఇక దేవిశ్రీప్ర‌సాద్ పాట‌ల‌కు ముందే క్రేజ్ వ‌చ్చింది. పిక్చ‌రైజేష‌న్ కూడా బాగుంది.  సీన్ల‌కు ప్రేక్ష‌కుడి మూడ్ క‌నెక్ట్ అయ్యేలా ఆర్ ఆర్ ఇచ్చినా కొన్ని ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మిర్చిని కాపీ కొట్టాడు. ఏఎస్‌.ప్ర‌కాష్ ఆర్ట్‌వ‌ర్క్ సినిమాతో పాటు పాట‌ల్లో మంచి లుక్ తీసుకువ‌చ్చింది. సీనియ‌ర్ ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ర‌న్‌టైంను కాస్త త‌గ్గించి ఉండాల్సింది. 163 నిమిషాల ర‌న్‌టైం కావ‌డంతో ఫ‌స్టాఫ్ స్పీడ్‌గా ముందుకు క‌ద‌ల‌డంతో ఎంజాయ్ చేసిన‌వారు సెకండాఫ్‌లో సినిమా సోసోగా వెళుతుండ‌డంతో అక్క‌డ‌క్క‌డా బోర్ ఫీల‌వుతారు. మ‌హేష్‌బాబు, శృతితో పాటు మిగిలిన వారి కాస్ట్యూమ్స్ కూడా అన్ని సీన్ల‌లోను చ‌క్క‌గా సెట్ అయ్యాయి. అన‌ల్ అర‌సు యాక్ష‌న్ సీక్వెల్స్ కూడా బాగానే డిజైన్ చేశారు. అయితే బృందావ‌నం, మిర్చిలో ఉండే సైలెంట్ స్టైల్ ఫైట్‌ను ఇక్క‌డ కూడా కాస్త మార్చి వాడేశారు.
ఫ్ల‌స్ పాయింట్స్‌:
మ‌హేష్‌-శృతి కాలేజ్ ట్రాక్‌
సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ
స్టోరీలైన్‌
యాక్ష‌న్ సీక్వెల్స్‌
మైన‌స్ పాయింట్స్‌:
స్లో న‌రేష‌న్‌
ఫైన‌ల్‌గా…
మ‌హేష్‌బాబు ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్న శ్రీమంతుడు వారి క‌ల‌ల‌ను నిజం చేసి ప్రిన్స్‌కు మ‌రో సూప‌ర్‌హిట్ సినిమా ఇచ్చింది. స్టోరీ లైన్ కొత్త‌ద‌నం, మ‌హేష్‌, శృతి కెమిస్ర్టీ, పాట‌లు, సాంకేతిక‌త సినిమాకు హైలెట్ అయితే ర‌న్ టైం ఎక్కువ కావ‌డం, సాగ‌దీత సీన్లు, సెకండాఫ్‌లో అక్క‌డ‌క్క‌డా బోర్ కొట్ట‌డం ఉన్నా ఓవ‌రాల్‌గా మాత్రం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క‌మ‌ర్షియ‌ల్‌గా మెప్పించాడు. ఈ సినిమా చూశాక చాలా మందికి త‌మ సొంత ఊర్ల‌కు వెళ్లి ఏదైనా చేయాల‌ని.. లేదా త‌మ పక్క‌వారు క‌ష్టాల్లో ఉంటే ఆదుకోవాల‌న్న ఫీలింగ్‌తో ఉంటారు. ఈ శ్రీమంతుడు ఏ స్థాయి శ్రీమంతుడు అవుతాడనే లెక్క‌ల కోస‌మే వేచి చూడాలి.
శ్రీమంతుడు మూవీ రేటింగ్‌: 3.5

NO COMMENTS

Leave a Reply