త‌ల్లి శ‌వంతో ..మంచు కొండ‌ల్లో

maa

అత‌నిపేరు మహ్మద్‌ అబ్బాస్‌(25). దేశ ర‌క్ష‌ణ కోసం జ‌వాన్ గా పఠాన్‌కోట్‌లో పనిచేస్తున్నాడు. అత‌నితో పాటు అత‌ని త‌ల్లి కూడా నివ‌సిస్తోంది. నాలు గు రోజుల క్రితం అతని తల్లి మరణించింది. మాతృమూర్తికి సొంతూరైన కర్మాలోనే అంత్యక్రియలు నిర్వర్తించాలనేది అబ్బాస్‌ కోరిక. కానీ అక్కడి నుంచి కర్మాకు వెళ్లాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏదైనా వాహనంలో వెళ్దామంటే వాతావరణం సహకరించని పరిస్థితి. రోడ్డుపై ఆరు అడుగుల మేర మంచు పేరుకుపోయివుంది. మృతదేహాన్ని తరలించేందుకు హెలికాప్టర్‌ను సిద్ధం చేస్తామని కుప్వారా జిల్లా అధికారులు మాటిచ్చారు. నాలుగు రోజులైనా దాని జాడ లేకపోవడంతో తల్లి మృతదేహాన్ని భుజానేసుకొని సొంతూరుకు బయలు దేరాడు. పదిగంటలు నడిచి అక్కడికి చేరుకున్నాడు.

అధికారుల తీరుతో తన తల్లికి సరైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోయానని అబ్బాస్‌ విల పించాడు. అయితే.. హెలికాప్టర్‌ను సిద్ధం చేశామని, వాతావరణం సరిగా లేకపోవడంతో సాయం పొందేందుకు అబ్బాస్‌ కుటుంబ సభ్యులు తిరస్కరించారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వాదనను అబ్బాస్‌ కొట్టిపారేశాడు. తాను త‌ల్లి శ‌వం ప‌క్క‌న నాలుగు రోజులు ఉండిపోయాన‌ని, హెలికాప్ట‌ర్ కోసం ఎదురు చూసి ఇక లాభం లేద‌ని ప్ర‌మాద‌క‌రం అయిన మంచుకొండ‌ల మీద న‌డిచాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

NO COMMENTS

Leave a Reply