“మంటి”క‌యినా “ఇంటో”డే కావాలె

snr2

“మంటిక‌యినా ఇంటోడే కావాలె” .. తెలంగాణ‌లో అనాదిగా ప్ర‌జ‌ల వాడుక‌ల్లో ఉండే సామెత‌ల్లో ఇదొక‌టి. ఈ సామెత ఊరికెనే రాలేదు. త‌మ‌ది అనుకున్న అస్థిత్వ‌పు పునాదుల మీద‌నే ప్ర‌తి ఒక్క‌రు వ్య‌క్తిగా, సంస్థ‌గా లేదా వ్య‌వ‌స్థ‌గా త‌ప‌న‌తో ప‌నిచేసి ఫ‌లితాలు తీసుకోవాలన్న ఆకాంక్ష‌ ఉంట‌ది కాబ‌ట్టే అటువంటి సంధ‌ర్భాల‌లో ఇలాంటి సామెత‌ను ఉదాహ‌రిస్తుంటారు. అనుకున్న కార్యం అదీ త‌ప్ప‌కుండా కావాల్సిన పనే అయినా అది జ‌రిపించి తీరాలన్న స్వీయ యాజ‌మాన్య‌పు ధోర‌ణి లేకుంటే (ఓన‌ర్ షిప్ మెంటాలిటీ) కాదు. కావాలనుకున్నది నెర‌వేర‌కుండా కోరిక గానే మిగిలిపోతది అని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో ప్రాజెక్టుల విష‌యంలో ఆంధ్రా ప్రాంత నాయ‌కులు చూపిన వివ‌క్ష‌, ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చొర‌వ‌కు అడ్డుత‌గులుతున్న ఈ ప్రాంత‌పు నేత‌ల తీరుపై ఆయ‌న నిప్పులు చెరిగారు. ఈ రోజు ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రాజెక్టుల మీద ఆంధ్ర పాల‌కులు స‌వ‌తి ప్రేమ చూయించార‌ని దానికి నిద‌ర్శ‌నం ప‌ట్టిసీమ ప్రాజెక్టు అని, ఆంధ్రా ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టిసీమ ప్రాజెక్టును 11 నెల‌ల 29 రోజుల‌లో పూర్తి చేశాడ‌ని, అదే చంద్ర‌బాబు స‌మైక్య రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా తెలంగాణ‌లో ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌భుత్వం భ‌క్త రామ‌దాసు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని కేవ‌లం 11 నెల‌ల‌లో పూర్తి చేసి ఈ రోజు అర‌వై వేల ఎక‌రాల‌కు నీళ్లు ఇస్తోంద‌ని, తెలంగాణ ఆత్మ‌, సోయి, ప్రేమ ఉన్న‌వాళ్లే తెలంగాణ గురించి ఆలోచిస్తార‌ని, అందుకే మంటిక‌యినా ఇంటోడు కావాల‌ని ఆయ‌న అన్నారు.

తెలంగాణలో పొలాల‌లో పారుతున్న నీళ్ల‌లో చూస్తే కేసీఆర్, హ‌రీష్ రావుల ప్ర‌తిబింబాలు క‌నిపిస్తాయి ..
కొత్త‌గా వ‌చ్చిన నీళ్ల‌తో రైతుల క‌ళ్ల‌ల్లో ఆనందం క‌నిపిస్తోంది ..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పాత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోనే  నాలుగు ల‌క్ష‌ల ఎకరాల‌కు నీళ్లొచ్చాయి అని సింగిరెడ్డి వెల్ల‌డించారు. 2001లోనే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో జ‌రిగిన‌ టీఆర్ఎస్ పార్టీ సభ‌లో మ‌న‌ తెలంగాణ కావాలి .. కోటి ఎక‌రాల స‌స్య‌శ్యామ‌ల సీమ అని క‌ర‌ప‌త్రాలు పంచాం అని .. ఈరోజు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తెలంగాణ ప్ర‌భుత్వంలో ఉండి తాము తెలంగాణ‌లో కోటి ఎక‌రాలు సాగు కావాల‌ని అన‌డం లేదు అని సింగిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కుచ్చిత‌, సంకుచిత భావాలు ఉన్న పార్టీ కాదు .. ఏ పూట కాపూట‌, అక్క‌డో మాట ఇక్క‌డో మాట టీఆర్ఎస్ పార్టీలో ఉండ‌దు అని, కాంగ్రెస్ పార్టీ మాదిరిగా డొంక తిరుగుడు మాట‌లు ఉండ‌వ‌ని ఆయ‌న అన్నారు.

ఎలాంటి అనుమ‌తులు లేని అక్ర‌మ ప్రాజెక్టు ప‌ట్టిసీమ‌ను 11 నెల‌ల 29 రోజుల‌లో నిర్మించిన ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మైక్య రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా తొమ్మిదేళ్లు ఉన్న‌ప్పుడు ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టును ఇంత శ‌ర‌వేగంగా ఎందుకు నిర్మించ‌లేదు ? దీనిని బ‌ట్టే ఆంధ్రా పాల‌కుల‌కు తెలంగాణ రైతుల మీద ఎంత చిత్తశుద్ది ఉంది ? అన్న‌ది బ‌య‌ట‌ప‌డుతుంది అని విమ‌ర్శించారు. ప‌ట్టిసీమ ఓ కుట్ర‌తో కూడిన ప్రాజెక్టు అని .. పోల‌వ‌రం ప్రాజెక్టు అనేక అనుమ‌తులు, అంత‌రాష్ట్ర వివాదాల కార‌ణంగా ఇప్ప‌ట్లో పూర్త‌య్యే అవ‌కాశం లేద‌ని భావించి .. త‌యారుగా ఉన్న పోల‌వ‌రం కుడికాలువ‌ను వినియోగించుకుని రోజుకు 0.8 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే విధంగా ప‌ట్టిసీమ నుండి నీళ్ల‌ను ప్రకాశం బ్యారేజీలోకి త‌ర‌లించి కృష్ణా డెల్టాకు వినియోగించుకుంటున్నారు. భ‌విష్య‌త్ లో పోల‌వ‌రం పూర్త‌యినా కృష్ణా డెల్టాకు ప‌ట్టిసీమ ద్వారా నీళ్లు త‌ర‌లించి కృష్ణా న‌దిలో ఉన్న ఆంధ్ర వాటాను రాయ‌ల‌సీమకు త‌ర‌లించే కుట్ర దాగి ఉంది అని సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు.

క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో క‌ల్వ‌కుర్తి ప్రాంతానికి నీళ్లు రావ‌డానికి మ‌ధ్య‌లో దుందుభి న‌ది అడ్డం ఉంది. దాని మీద భారీ అక్విడెక్టు నిర్మించాల్సి ఉంది. ఈ ఏడాది ఎంతో క‌ష్ట‌ప‌డితే కాల్వ ఆవంచ వ‌ర‌కు వ‌చ్చింది. ఈ ఏడాదిలో ఖ‌చ్చితంగా అక్విడెక్టు నిర్మించి .. మిగ‌తా కాల్వ‌ను తవ్వి క‌ల్వ‌కుర్తికి నీళ్లిస్తాం .. వైఎస్ హ‌యాంలో నీల్లు త‌ర‌లిస్తుంటే నోరు మూసుకుని ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం మీద బుర‌ద జ‌ల్లుతున్నారు. నీళ్లు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌కులు కాంగ్రెస్ నేతలు .. ప్ర‌జ‌ల‌కు నిజాలు వివ‌రించేందుకు మేము సిద్దంగా ఉన్నాం .. స‌మావేశం పెడితే రాష్ట్ర మీడియా సాక్షిగా క‌ల్వ‌కుర్తిలోనే నిజాలు వివ‌రిస్తాం .. వాట్స‌ప్ మెసేజ్ ల‌తో .. వ్య‌క్తిగ‌త స‌మావేశాల‌లో నైతిక‌త లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం మూలంగా తాత్కాలిక ఆనందం క‌లుగుతుందేమో కానీ .. శాశ్వ‌త ప్ర‌యోజ‌నం ఉండ‌దు అని సింగిరెడ్డి అన్నారు.

వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం క‌ల్వ‌కుర్తి ప్రాంతం క‌న్నా అర‌వై అడుగుల దిగువ‌న ఉంది అని, గ‌త ప్ర‌జాప్ర‌తినిధులు ఒక‌రి హ‌యాంలో ఒక‌రు నీళ్లు తీసుకొస్తే ఇంకొక‌రికి పేరొస్తుంది అని .. ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించి అక్క‌సుతో క‌ల్వ‌కుర్తి నుండి వ‌న‌ప‌ర్తికి రావాల్సిన నీళ్ల గురించి ప‌ట్టించుకోలేదు అని సింగిరెడ్డి అన్నారు. వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని అనుస‌రించి 40 కిలోమీట‌ర్లు కృష్ణా న‌ది పారుతుంది .. న్యాయ‌బ‌ద్దంగానే ఆ ప్రాంతానికి నీళ్లు వ‌స్తున్నాయి .. క‌ల్వ‌కుర్తి ప్రాంతానికి కూడా ఖ‌చ్చితంగా నీళ్లు వ‌స్తాయి.. తెలంగాణ ప్ర‌భుత్వ‌మే ఇచ్చి తీరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

NO COMMENTS

Leave a Reply