ఐరాస వేదిక‌పై తెలంగాణ చేనేత‌

 

తెలంగాణ రాష్ట్రం నుండి ఐక్య‌రాజ్య‌స‌మితి యువ‌జ‌న అసెంబ్లీలో పాల్గొనేందుకు అరుద‌యిన అవ‌కాశం ద‌క్కించుకున్న హైద‌రాబాద్ కుషాయిగూడ‌కు చెందిన సింగిరెడ్డి అఖిలేష్ రెడ్డి ఆ వేదిక మీద తెలంగాణ చేనేత వ‌స్త్రాల‌తో హాజ‌రై త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డ‌మే కాకుండా తెలంగాణ గౌర‌వాన్ని ఇనుమ‌డింప‌జేశాడు.

ఈ సంధ‌ర్భంగా అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ సాధార‌ణంగా ఇలాంటి అంత‌ర్జాతీయ స్థాయి వేదిక‌ల మీద సూటు, బూటు ధ‌రించి పాల్గొంటారు. అయితే రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేనేత రంగానికి చేయూత నివ్వాల‌న్న పిలుపును అనుస‌రించి ఈ వేదిక స‌ర‌యిన‌దిగా భావించాను. అందుకే చేనేత వ‌స్త్ర‌దార‌ణ‌తో హాజ‌ర‌య్యాను. అక్క‌డికి వ‌చ్చిన వారంత నా వేష‌ధార‌ణ‌ను ప్ర‌త్యేకంగా చూసి ఆరాతీసి అభినందించారు అని అన్నారు. త‌న త‌ల్లిదండ్రులు మ‌ధుసూధ‌న్ రెడ్డి, జ్యోతిరెడ్డిల ప్రోత్సాహ‌మే త‌న‌ను ఇలాంటి వేదిక‌లలో పాల్గొనే ధైర్యాన్ని ఇచ్చింద‌ని అఖిలేష్ రెడ్డి అన్నారు.

singireddy

NO COMMENTS

Leave a Reply