ఆప్ కు ఊహించ‌ని షాక్

aap2

పంజాబ్‌, గోవాలో రేపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి ఉన్న రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రూ. 27 కోట్ల విరాళాల గురించి ఆప్ తప్పుడు, కల్పిత ఆడిట్‌ నివేదికలను సమర్పించిందని, కాబట్టి దాని రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని ఈసీకి ఐటీ నివేదించినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్ పంజాబ్, గోవాలో తొలిసారి పోటీచేస్తుంది. ఢిల్లీలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన గోవా, పంజాబ్ లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు నివేదిక అందడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2013-14లో, 2014-15లో తప్పుడు, కల్పిత ఆడిట్‌ నివేదికలను ఆప్‌ సమర్పించిందని, కాబట్టి ట్రస్టుగా, రాజకీయ పార్టీగా ఆప్‌ హోదాను పునఃసమీక్షించి.. రద్దు చేయాలని సిఫారసు చేస్తూ ఐటీ ఈసీకి ఆరుపేజీల నివేదిక సమర్పించిందని ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’ ప‌త్రిక‌ ఒక కథనంలో పేర్కొంది.

NO COMMENTS

Leave a Reply