శ‌శి”క‌ల‌”కు సుప్రీం బ్రేకులు

shashikala

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చునేందుకు రంగం సిద్ధం చేసుకున్న జయలలిత నెచ్చెలి శశికళకు సుప్రీంకోర్టు షాక్ త‌గిలేలా క‌నిపిస్తోంది. ఈ నెల 9న శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే మరో వారం రోజుల్లోగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై తుదితీర్పు వెలువరించనున్నట్టు సుప్రీకోర్టు తెలిపింది. ఈ కేసులో శశికళ సహ నిందితురాలిగా ఉన్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ జయలలితపై అవినీతి నిరోధక చట్టం కింద 1996లో కేసు నమోదైంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 2014లో జయను దోషిగా పేర్కొంటూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు సహనిందితురాలిగా ఉన్న శశికళకు కూడా జైలు శిక్ష పడింది.

అయితే 2015లో కర్నాటక హైకోర్టు జయలలితపై నమోదైన కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలిత కొంతకాలం ముఖ్య‌మంత్రి పీఠానికి దూరమైనప్పటికీ… గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టారు. జయ మరణంతో ఆమె దశాబ్దాలుగా కొనసాగిన ఏఐడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని శశికళ చేపట్టారు. ఈ నేప‌థ్యంలో వారం రోజుల్లో వెలువడనున్న సుప్రీం తీర్పుతో శశికళ ముఖ్య‌మంత్రి కావాలన్న కోరిక తీరుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

NO COMMENTS

Leave a Reply