ఇయ్యాల ష‌బ్బీర్ అలీ వంతు !

ktr

మేం త‌లుచుకుంటే తెలంగాణ ఉద్య‌మాన్ని టీఆర్ఎస్ ను అణ‌చివేసే వాళ్లం అంటూ సీనియ‌ర్ నేత‌, సీఎల్పీ నాయ‌కులు జానారెడ్డి నిన్న శాస‌న‌స‌భ‌లో నోరు పారేసుకొని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల పాలు అయ్యారు. కాంగ్రెస్ పార్టీని న‌లుగురిలో న‌వ్వుల పాలు చేశారు. అయినా కూడా కాంగ్రెస్ నాయకులలో మార్పు రాలేదు. అస‌లు కాంగ్రెస్ నాయ‌కుల వ‌ద్ద విష‌యం ఉండ‌ద‌ని, వీరు అదృష్టం కొద్దీ రాజ‌కీయాల్లో రాణిస్తున్నార‌ని ఈ రోజు శాస‌న‌మండ‌లిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీ అన్న మాట‌ల‌ను చూస్తే స్ప‌ష్టం అవుతుంది.

మండ‌లిలో వ్య‌వ‌సాయం మీద జ‌రిగిన చ‌ర్చ సంధ‌ర్భంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని మండ‌లిలో విప‌క్ష కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ నోరు పారేసుకున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ప్ర‌జ‌లు పోరాడి సాధించుకున్నార‌ని, నిన్న శాస‌న‌స‌భ‌లో ఒక‌రు, ఈ రోజు ఇక్క‌డ మీరు ఇలా మాట్లాడ‌డం స‌రికాద‌ని, కాంగ్రెస్ నేత‌ల మాట‌లు హంతకులే సంతాప‌స‌భ‌లు పెట్టిన‌ట్లు ఉంద‌ని విమ‌ర్శించారు. ష‌బ్బీర్ అలీ త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని, 1956లో బ‌ల‌వంతంగా క‌లిపిన పాపం కాంగ్రెస్ ద‌ని, 1969 విద్యార్థుల‌ను కాల్చి చంపిన పాపం కాంగ్రెస్ దేనని, 2004 నుండి 2014 దాకా సాగ‌దీసి అనేక మంది అమ‌రుల ఉసురుపోసుకుంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. మొత్తానికి కాంగ్రెస్ నేత‌ల‌కు ఓ ప్ర‌ణాళిక గానీ, ఓ ఆలోచ‌న గానీ లేద‌ని జానారెడ్డి, ష‌బ్బీర్ అలీల మాట‌ల‌ను బ‌ట్టి తేలిపోయింది.

NO COMMENTS

Leave a Reply