నేను చ‌నిపోతే నా పిల్లల‌కు దిక్కెవ‌రు

‘‘నేను అసెంబ్లీలో అడుగుపెట్టిన నాటి నుండి వేధిస్తున్నారు. ఈ రోజు నా వ‌ద్ద ఉన్న ఫోన్ లాక్కున్నారు. నా గ‌న్ మెన్ ను తీసేశారు. ఇక న‌న్ను చంప‌ర‌ని గ్యారంటీ ఏంటి ? నా ప్రాణాల‌కు ర‌క్ష‌ణ ఏంటి ? నేను చ‌నిపోతే నా పిల్ల‌ల‌కు దిక్కెవ‌రు’’ అని ఆంధ్ర రాష్ట్ర‌ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌, న‌టి రోజా క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సు కు హాజరయ్యేందుకు వెళ్తున్న రోజాను గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ మణికొండలో ఉన్న ఆమె నివాసానికి తరలించారు.

ఆ త‌రువాత హైద‌రాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి చేరుకున్న రోజా మీడియాతో మాట్లాడారు.
జాతీయ మహిళా సాధికారత సదస్సు అని ఆహ్వానం పంపి విమానాశ్రయంలో తనను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేశారు. నా వ‌ద్ద క‌త్తులు, తుపాకులు ఉన్న‌ట్లు అదుపులోకి తీసుకున్నారు. మ‌హిళ‌ల మీద చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వానికి ఉన్న చిన్న‌చూపు ఇది అని రోజా అన్నారు. రోజాను త‌ర‌లిస్తుండ‌గా పేరిచ‌ర్ల వ‌ద్ద ఆమె వాహ‌నం నుండి దూకింద‌ని తెలుస్తోంది. అయినా పోలీసులు బ‌ల‌వంతంగా మ‌ళ్లీ వాహ‌నంలోకి ఎక్కించి త‌ర‌లించారు. పోలీసు వాహ‌నం నుండే ఫేస్ బుక్ లైవ్ ద్వారా రోజా మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

roja

NO COMMENTS

Leave a Reply