కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి

revanth2

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మై హోం సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావుకు నిబంధనలకు విరుద్దంగా భూములు కట్టబెట్టారని, ఆయనకు లబ్ది చేకూరే విధంగా పనిచేస్తుందని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీద రామేశ్వర్ రావు పరువునష్టం కేసు పెట్టారు. తప్పుడు ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగించినందున క్షమాపణ చెప్పి, నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోర్టులో పిటీషన్ వేశారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ కేసుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కేసును వచ్చే నెల 28కి వాయిదా వేసింది. తప్పులు ఎత్తి చూపుతున్నానని ప్రభుత్వం నా మీద కక్ష చూపుతుందని, నా వద్ద ఉన్న అన్ని ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచుతానని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ కేసుతో పాటు కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యల కేసులో కూడా రేవంత్ రెడ్డి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

 

NO COMMENTS

Leave a Reply