ఆస్ప‌త్రిలో చేరిన రామోజీ రావు

ramoji rao3

ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీ రావు ఆస్ప‌త్రిలో చేరారు. వైరల్‌ ఫీవర్‌, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం నుంచి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎన్‌వీ రావు, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ నవనీతసాగర్‌ రెడ్డిల బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తోంది.
ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం స్వల్పంగా ఆహారం కూడా తీసుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కొద్దికాలంగా త‌న ఆరోగ్య కారాణాల రీత్యా ఈనాడు గ్రూపు నిత్య వ్యాపార కార్య‌క‌లాపాల‌కు రామోజీ దూరంగా ఉంటున్నారు.

NO COMMENTS

Leave a Reply