నోబెల్ : బాబుపై రామోజీకి చిర్రెత్తుకొచ్చింది

నోబెల్ బ‌హుమ‌తి సాధించిన ఆంధ్రా శాస్త్ర‌వేత్త‌కు రూ.100 కోట్లు న‌జ‌రానా ఇస్తాం అంటూ ఆంధ్రా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు య‌ధావిధిగా ఓ ప్ర‌క‌ట‌న చేసేశారు. అడ్డ‌గోలు ప్ర‌క‌ట‌న‌లు .. హామీలు త‌లా తోకా ఓ ఆలోచ‌న ప‌ద్ద‌తి లేకుండా చేసే చంద్ర‌బాబుకు ఇది మామూలే. అయితే దేశ ప్ర‌తిష్ట‌కు సంబంధించిన ఈ విష‌యంలో నోబెల్ బ‌హుమ‌తి గురించి తేలిగ్గా ఓ హామీ విసిరేయ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. దీని మీద సోష‌ల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు వ‌చ్చాయి. ఇక శ్రీ‌హ‌రికోట‌లోని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌ల‌కు అవ‌స‌రం అయిన మౌళిక వ‌స‌తులు, నిధులు ఇవ్వ‌కుండా వేదికల మీద మాత్రం హామీలు ఇస్తారు అని విమ‌ర్శించారు.

ఇక చంద్ర‌బాబు ఏం చేసినా దానిని క‌వ‌ర్ చేసుకుంటూ పోయే ఈనాడు అధినేత రామోజీరావుకు కూడా ఈ విష‌యం అస్స‌లు న‌చ్చ‌న‌ట్లు ఉంది. గ‌త కొన్నాళ్లుగా ఇద్ద‌రికి పొస‌గ‌డం లేద‌ని, రామోజీ బాబు పాల‌న‌ను చూసి ఏమీ అన‌లేక మెల్ల‌గా జ‌గ‌న్ కు కూడా ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో బాబు నోబెల్ ప్ర‌క‌ట‌న‌పై ఈనాడులో ఓ క‌థ‌నం రావ‌డం ఆంధ్ర రాజ‌కీయాల్లో ఊహాగానాల‌కు తెర‌లేపింది.

నోబెల్‌ బహుమతి సాధించే తొలి ఆంధ్రుడికి రూ. 100 కోట్ల బహుమతి ఇస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యార్థులు, భావి శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నింపడం కోసం ఆయన చేసిన ప్రకటన మెచ్చుకోతగినదే. కాని అసలు పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన నాసిరకంగా ఉన్నపుడు.. తరగతి గదులు, మరుగుదొడ్లు కూడా లేనప్పుడు.. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు ఇంటిముఖం పడుతున్నపుడు భావి శాస్త్రవేత్తలు ఎలా రూపొందుతారు?

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి? మానవాభివృద్ధి స్థితిగతులేమిటి? వీటిగురించి అధ్యయనం చేసిన సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్‌) పరిస్థితి గణనీయంగా మెరుగుపడాల్సి ఉందని సూచించింది. అంటూ సాగిన క‌థ‌నం సెస్ భుజాల మీద పెట్టి చంద్ర‌బాబును కాల్చింద‌ని బాబు – రాజ‌గురువు రామోజీరావు సాన్నిహిత్యం తెలిసిన వారికి అర్ధం అవుతుంది. మ‌రి దీనికి బాబు ఏం క‌వ‌రింగ్ ఇస్తాడు ..అన్న‌ది వేచిచూడాలి.

eenadu eenadu1

 

NO COMMENTS

Leave a Reply