బ్యాంక్ అవుతున్న పేటీఎం

paytm

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం మెరుపు వేగంతో దూసుకుపోతున్న ప్రముఖ మొబైల్‌ వ్యాలెట్‌ పేటీఎం ఇపుడు మ‌రో రూపంలో రానుంది. త్వ‌ర‌లో చెల్లింపు బ్యాంకును ప్రారంభించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) నుంచి అనుమతి లభించింది. చెల్లింపు బ్యాంకుగా పేటీఎంకు 2015లోనే ఆమోదం లభించినా, అందుకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తి చేయడంలో రెండు సార్లు విఫలమైంది. తాజాగా ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ స్పష్టం చేశారు.

ఇటీవల టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ చెల్లింపు బ్యాంకుగా అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పేటీఎంకు కూడా అనుమతి లభించింది. దీంతో యాప్ రూపంలో వ‌చ్చి పేమెంట్ బ్యాంక్ హోదా సంపాదించుకున్న మొద‌టి ఆవిష్క‌ర‌ణ‌గా పేటీఎం గుర్తింపు పొంద‌నుంది.

NO COMMENTS

Leave a Reply