వేట ముగిసింది..ఇక ఆట ఆరంభం!

ప‌వ‌న్ కల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స‌ర్దార్ సినిమా హీరోయిన్ వేట ఎట్ట‌కేల‌కు ముగిసింది. అనీషా ఆంబ్రోస్ ను త‌ప్పించిన త‌ర్వాత ఆ స్థానాన్ని ఎవ‌రి భ‌ర్తి చేస్తారా? అన్న దానికి తెర‌ప‌డిపోయింది.  వాస్త‌వానికి నాలుగైదు నెల‌ల‌ నుంచి హీరోయిన్ కో సం యూనిట్ అన్వేషిస్తుంది. కానీ సినిమా ప్రారంభ‌మైన‌ హీరోయిన్ ఎంపిక మాత్రం పూర్తికాలేదు. నాయిక కోసం యూనిట్  దేశం మొత్తం జ‌ల్లెడ‌ ప‌ట్టేసింది. అయినా కుద‌ర‌లేదు.  దీంతో ఇక ప‌వ‌న్ స్వ‌యంగా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. యూనిట్ దేశ‌, విదేశాలు తిరిగితే ప‌వ‌న్ మాత్రం సింపుల్ గా త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఫైనెల్ చేసేశార‌ట‌. కొద్ది రోజుల క్రిత‌మే అమ్మ‌డు స‌ర్దార్ షూటింగ్ కు హ‌జ‌రైంద‌ని అంటున్నారు. అయితే ప‌వ‌న్ కావాల‌నే ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచార‌ని అంటున్నారు. మ‌రికొద్ది రోజుల్లో అధికారికంగా మీడియా ముందుకు ఈ చంద‌మామ‌ను తీసుకురానున్న‌ర‌ని అంటున్నారు. త్వ‌ర‌లో మూడ‌వ షెడ్యూల్ హైద‌రాబాద్ లో ప్రారంభం కానుంది.

NO COMMENTS

Leave a Reply