ప‌వ‌న్ బ‌తుకులో “చిరు” మ‌న్ను

chiranjeevi759

సినిమాల్లో చిరు రీ ఎంట్రీతో ఆంధ్రాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ప్ర‌జారాజ్యం పెట్టి ప‌రువు పోగొట్టుకుని కాంగ్రెస్ లో కలిపి కేంద్ర‌మంత్రి అయిన చిరంజీవి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక సాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుడుగా మిగిలిపోయాడు. దీంతో అభిమానులు కోరుతున్నారు అంటూ వంక పెట్టి సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చాడు. సాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుడుగా ఉండ‌డం వేరు .. సినిమా రంగంలో క‌నిపిస్తుండ‌డం వేరు. ఇప్పుడు ఏ ప‌నిలేని చిరు ఇక వ‌ర‌స‌గా సినిమాలు చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాడు. దానికి తోడు మాటీవీ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కూడా చేస్తున్నాడు.

అయితే 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ చ‌క్రం తిప్పాల‌న్న త‌మ్ముడు గ‌బ్బ‌ర్ సింగ్ ఆలియాస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌ల మీద త‌న తాజా ఎంట్రీతో చిరంజీవి నీళ్లు చ‌ల్లాడ‌న్న‌ది ఆంధ్రా రాజ‌కీయాల్లో వినిపిస్తున్న మాట‌. 2014 ఎన్నిక‌ల్లో కాపుల ఓట్లు జ‌గ‌న్ వైపు వెళ్ల‌కుండా చేసి చంద్ర‌బాబుకు అధికారం వ‌చ్చేలా చేసిన జ‌న‌సేన ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుతో పాటు కాపుల ఓట్లు చీలి చంద్ర‌బాబు అధికారం పోకుండా చేసే ప్ర‌య‌త్నాల‌లో ఉన్నాడు.

ప్ర‌శ్నిస్తా .. ప్ర‌శ్నిస్తా అంటూ గాలి మాట‌లు చెప్పిన ప‌వ‌న్ ఆంధ్రాలో ప్ర‌భుత్వ అక్ర‌మాలు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద ఈ మూడేళ్ల‌లో ఎన్న‌డూ గట్టిగా నిల‌దీసి నిల‌బ‌డింది లేదు. జ‌నంలో షో చేసేందుకు ట్విట్ట‌ర్ లో .. అప్పుడ‌ప్పుడూ ప్ర‌జ‌ల్లో క‌నిపించి మీడియాలో క‌నిపించ‌డం చేస్తున్నాడు.

ఆంధ్రాలో కాపుల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన అన్యాయం ..అణ‌చివేత మూలంగా ఈ సారి ప‌వ‌న్ ను వారు అస్స‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. చిరంజీవి ముద్ర‌గ‌డ‌ల మ‌ధ్య సాన్నిహిత్యం నేప‌థ్యంలో వారు చిరంజీవి త‌ట‌స్థంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో చిరంజీవి కాంగ్రెస్ ను వీడే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ చిరు ఎన్నిక‌ల వ‌ర‌కు మొగ్గినా అంత‌ర్లీనంగా పార్టీ మార‌కున్నా జ‌గ‌న్ వైపు మొగ్గుతాడ‌ని, ఈ మేర‌కు అంత‌ర్గ‌త సాన్నిహిత్యం పెరిగింద‌ని అంటున్నారు. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోలుబొమ్మ‌లాట‌లో కేతిగాడు అయ్యేలా ఉన్నాడ‌ని అంటున్నారు.

NO COMMENTS

Leave a Reply