లంచం తీసుకోవ‌డం నేర్పుతున్న మంత్రిగారు

pankaja1

బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి పంకజ్‌ ముండే మ‌రోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఓ స్కామ్‌ కేసులో ఏసీసీ నుంచి క్లీన్‌చిట్‌ పొందిన పంకజ్‌ ముండే తాజాగా చేసిన వ్యాఖ్య‌లు మ‌ళ్లీ స‌మ‌స్య‌ల పాలు చేసేలా క‌నిపిస్తున్నాయి. బీడ్‌ జిల్లా నెక్నూర్‌ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘మనవాళ్లకు డబ్బులు (లంచం) తీసుకోవడం కూడా చేతకాదు..ఏ పేపర్‌పై అయినా సంతకం చేస్తారు అని అన్నారు. ఆమె వ్యాఖ్యలతో కూడిన వీడియోను స్థానిక ఛానెళ్లు యథాతథంగా ప్రసారం చేయడంతో కలకలం రేగింది. పంకజ్‌ ముండే బీజేపీ నేత దివంగత గోపీనాథ్‌ ముండే కుమార్తె.

పాఠశాల విద్యార్థులకు ఆహార పదార్ధాల సరఫరా కాంట్రాక్టు కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పంక‌జ్ ముండే పాత్రపె ఇటీవ‌లే ఏసీబీ విచారణ చేపట్టింది. రూ 206 కోట్ల ఈ కాంట్రాక్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. చిక్కీ స్కామ్‌గా పేరొందిన ఈ కుంభకోణంలో ఇటీవల క్లీన్‌చిట్‌ దక్కడంతో ఆమె ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు గత ఏడాది ఏప్రిల్‌లో కరువు పీడిత లాతూర్‌లో జల సంరక్షణ పనులను సమీక్షిస్తూ ఆమె సెల్ఫీలు దిగడం వివాదాస్పదమైంది. తాజాగా ఈ వ్యాఖ్య‌లు చేసి ఇర‌కాట‌లో ప‌డిపోయారు.

NO COMMENTS

Leave a Reply