అసాంజేతో ప‌మేలా అండ‌ర్స‌న్ డేటింగ్

‘బే వాచ్’ నటి పమేలా ఆండర్సన్ తో ‘వికీ లీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రేమలో పడ్డారని ప్ర‌ముఖ ఇంగ్లీష్ ప‌త్రిక‌ ‘డైయిలీ మెయిల్’ పేర్కొంది. లండన్ లోని యూరోపియన్ ఎంబసీలో అసాంజ్ ఉంటున్న విష‌యం తెలిసిందే. ఆయనను పమేలా అక్టోబ‌ర్, న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ లో తాజాగా జ‌న‌వ‌రి 21న మొత్తం ఐదుసార్లు కలిసిందని పేర్కొంది. ఆయన్ని కలిసిన ప్రతిసారి, అదిరిపోయే డ్రెస్సులు ధరించింది.

పమేలా, అసాంజ్ తొలిసారిగా 2014 సెప్టెంబర్ లో కలుసుకున్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళల కోసం తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కు మద్దతు తెలపాల్సిందిగా అడిగే నిమిత్తం అసాంజ్ ను పమేలా కలిసింది. 2016 అక్టోబర్, నవంబర్ లో ఒకసారి, డిసెంబర్ లో రెండు సార్లు ఆయన్ని కలిసిందని మీడియా పేర్కొంది.

asanje pamela pamela1 pamela2 pamela3 pamela4

 

NO COMMENTS

Leave a Reply