ఎన్టీఆర్ సినిమాలో చంద్ర‌బాబు పాత్రేంటో ?!

Balakrishna-at-Bapu-Film-Fe

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు హీరో బాలకృష్ణ ప్రకటించారు. నేడు తన అల్లుడు లోకేష్ తో కలసి నిమ్మకూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కోరిన బాలయ్య, ఎన్టీఆర్ పై సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌ను తానే పోషిస్తాన‌ని తెలిపారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, నిమ్మకూరులో తలపెట్టిన 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

ఎన్టీఆర్ పాత్రను పోషించడం తనకు లభించిన వరమని, చిత్ర దర్శక, నిర్మాతలను త్వరలోనే ప్రకటిస్తానని బాల‌కృష్ణ అన్నారు. అతి త్వరలోనే మిగతా విషయాలన్నింటినీ తెలియజేస్తానని, హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ అసలు మొదలు కాలేదని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్నో అంశాలను అభిమానులు తెలుసుకోవచ్చని అన్నారు. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అన్నారు. మ‌రి ఈ చిత్రంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర ఎలా ఉంటుంది. వెన్నుపోటు అంశం ఉంటుందా ? ఉండ‌దా ? వైస్రాయ్ హోట‌ల్ సీన్లు ఉంటాయా ? ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర ఎవ‌రు పోషిస్తారు ? అని నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు.

NO COMMENTS

Leave a Reply