యుండ‌మూరి కుసంస్కారి .. వ‌ర్మ ట్విట్ట‌ర్ పిట్ట‌

naga

అత‌నో ర‌చయిత‌. వాడొక కుసంస్కారి. వాడు వ్య‌క్తిత్వ వికాసం పాఠాలు చెబుతాడు.కానీ వాడికి వ్య‌క్తిత్వం లేదు. వాడు ఎప్పుడూ ఆన్ లైన్ లోనే ఉంటాడు. ముంబ‌యిలో సినిమాలు చేసుకునేవాడు ఇక్క‌డా చేస్తున్నాడు. సినిమాలు తీయ‌డం రాదు. అక్కుప‌క్షి పిచ్చికూత‌లు కూస్తాడు. ముందు సినిమాలు మంచిగా తీయ‌డం మీద దృష్టిపెడితే బాగుంటుంది అని ఖైదీ నంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు నిప్పులు చెరిగాడు. ఎన్ని స‌ర్జ‌రీలు చేసినా రాంచ‌ర‌ణ్ లో టాలెంట్ లేనిది వేస్ట్ అని గ‌తంలో అన్నాడు .. వ‌ర్మ ట్వీట్ల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని నాగ‌బాబు తీవ్రంగా విమ‌ర్శించాడు.

రీమేక్ లు చేయ‌డంలో త‌ప్పేంట‌ని, చిరంజీవి ఏం చేయాలో ? ఏం చేయ‌కూడాదో చెప్పేంత వాళ్లా వీళ్లు ? మెగా బ్ర‌ద‌ర్స్ అంతా క‌ష్ట‌ప‌డి పైకొచ్చార‌ని నాగ‌బాబు అన్నాడు. త‌మ ఫ్యామిలీని ఏదో అన‌డం ద్వారా వీళ్లు మైలేజి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, వీళ్లు తీరు మార్చుకుంటే మంచిద‌ని ఈ వేదిక సాక్షిగా చెబుతున్నాన‌ని నాగ‌బాబు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

NO COMMENTS

Leave a Reply