సినిమాలో తేడా వ‌స్తే ర‌హ‌స్యాలు బ‌య‌ట‌కొస్తాయి

nadendla2

అస‌లు తెలుగుదేశం పార్టీని స్థాపించింది నేను. కానీ టీడీపీ నేత‌లు స్వార్ధం కోసం ఆ పార్టీని ఎన్టీఆర్ స్థాపించాడ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి త‌మ‌ను విల‌న్లుగా చూయిస్తే తాము చాల విష‌యాలు బ‌య‌ట‌పెట్టాల్సి వ‌స్తుంది. మా వ‌ద్ద ఉన్న రహ‌స్య వివ‌రాలు బ‌య‌ట‌పెట్టే ప‌రిస్థితి తీసుకురావ‌ద్ద‌ని మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు హెచ్చ‌రించారు.

ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు నాదెండ్ల ముఖ్య‌మంత్రి అయిన విష‌యం తెలిసిందే. బాల‌కృష్ణ ఎన్టీఆర్ సినిమాను తీస్తాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో నాదెండ్ల తెర మీద‌కు వ‌చ్చారు. ఇప్ప‌టికే ల‌క్ష్మీపార్వ‌తి హెచ్చ‌రించిన నేప‌థ్యంలో నాదెండ్ల హెచ్చ‌రిక‌లు కూడా ఆస‌క్తి రేపుతున్నాయి. ఎన్టీఆర్ సినిమాకు హీరో తానేన‌ని, అస‌లు విల‌న్ చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే స‌రికి ఏమేం జ‌రుగుతుందో వేచిచూడాలి.

NO COMMENTS

Leave a Reply