ఖైదీపై “క‌త్తి” దూసిన మురుగ‌దాస్

murugadas
నేను క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కే ప్రాధాన్యం ఇస్తాను .. నా ఫ్యాన్స్ నా నుండి అవే కోరుకుంటారు అని 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చేసిన న‌టుడు చిరంజీవి అన్నాడు. అయితే త‌న క‌త్తి సినిమాను ఇలా రీమేక్ చేసిన ద‌ర్శ‌కుడు వినాయ‌క్, హీరో చిరంజీవి మీద త‌మిళ దర్శ‌కుడు మురుగ‌దాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడ‌ట‌.

త‌న చిత్రంలో ఎక్క‌డా ఆల్క‌హాలు తాగుతున్న దృశ్యాలు లేకుండా సినిమా తీయ‌డం మురుగ‌దాస్ కు అలవాటు. అయితె క‌త్తిని ఖైదీగా తెలుగులో రీమేక్ చేసిన వినాయ‌క్ అందులో ఆల్క‌హాల్ తాగుతున్న దృశ్యాలు పెట్ట‌డం ప‌ట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. ఈ మేర‌కు హైద‌రాబాద్ లోనే ఉన్న ఆయ‌న త‌న స‌న్నిహితులతో ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించాడ‌ట‌. మురుగ‌దాస్ సినిమాల‌లో విల‌న్ అయినా ఛాయ్ లేదా కాఫీ తాగుతూ క‌నిపిస్తారు. ఆల్క‌హాల్ దృశ్యాలు అస్స‌లు క‌నిపించ‌వు. మ‌రి మ‌న చిరుకు, వినాయ‌క్ కు అంత సామాజిక బాధ్య‌త ఎక్క‌డిది లెండి.

NO COMMENTS

Leave a Reply