కొడుకు కోసం మ‌న‌వ‌రాళ్ల‌తో ములాయం ముచ్చ‌ట్లు

Mulayam-Singh-Yadav

స‌మాజ్‌వాదీ పార్టీలో సాగుతున్న సైకిల్ వార్‌లో కొత్త‌, ఆసక్తిక‌ర‌మైన ఎపిసోడ్ ఇంది. పార్టీపై ప‌ట్టు కోసం తండ్రీ కొడుకులైన‌ ములాయం సింగ్ యాద‌వ్‌, అఖిలేష్ యాద‌వ్‌ ఎంత‌గా పోరాడుతున్నారో తెలిసిందే క‌దా. ఎన్నిక‌ల వేళ పార్టీ గుర్తు కోసం కూడా ఎన్నిక‌ల సంఘం ద‌గ్గ‌ర ఫైట్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఇంటి బ‌య‌ట సాగుతున్న యుద్ధ‌మే. ఈ తండ్రీకొడుకుల ఇళ్ల‌లో మాత్రం ప‌రిస్థితి వేరుగా ఉందని అంటున్నారు. ములాయం త‌న మ‌న‌వ‌లు, మ‌న‌వ‌రాళ్ల‌తో హ్యాపీగా ముచ్చ‌ట్లాడుతున్నారు.

యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌ కూతుళ్లు అదితి (15), టీనా (10) త‌మ‌ తాత ములాయం సింగ్ యాద‌వ్‌ తో ఎప్ప‌టిలాగే ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వారితో ములాయం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొన్నిరోజుల కింద‌ట త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన అఖిలేష్ కూతుళ్ల‌తో.. మీ నాన్న చాలా మొండివాడు అని ములాయం అన్నార‌ట‌. ఈ విష‌యాన్ని వాళ్లు కూడా అలాగే అఖిలేష్ చెవిన వేయ‌డంతో.. ఆయ‌న కూడా న‌వ్వుతూ.. అవును నేను మొండివాడినే అన్నార‌ట‌. ఈ త‌ర్వాతే యూపీలో సైకిల్ వార్‌, పార్టీలో పై చేయి కోసం పోరాటం సాగ‌డం ఆస‌క్తిక‌రం.
వ‌చ్చే నెల‌లో యూపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో స‌మాజ్‌వాదీ పార్టీ గుర్తు సైకిల్ కోసం ములాయం, అఖిలేష్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సోమ‌వార‌మే ములాయం నేరుగా ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి త‌న ప్ర‌మాణ ప‌త్రం దాఖ‌లు చేశారు. ఓ వ్య‌క్తి వ‌ల్లే ఎస్పీలో ముస‌లం ఏర్పడింద‌ని ఆ వ్య‌క్తి పేరు చెప్ప‌కుండా ములాయం చెప్పారు. ఆ వెంట‌నే అఖిలేష్ వ‌ర్గంలోని రాంగోపాల్ యాద‌వ్ కూడా ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిశారు. సైకిల్ కోసం రెండు వ‌ర్గాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అన్న ఆస‌క్తి నెల‌కొంది.

NO COMMENTS

Leave a Reply