సినిమా రివ్యూ: జేమ్స్‌బాండ్

జోన‌ర్‌:  కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌
న‌టీన‌టులు: న‌రేష్‌, సాక్షి చౌద‌రి, ఆశిష్ విద్యార్థి, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, చంద్ర‌మోహ‌న్‌, రఘుబాబు త‌దిత‌రులు
సంగీతం:  సాయి కార్తిక్‌
నిర్మాత :  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ద‌ర్శ‌క‌త్వం:  సాయి కిషోర్ మ‌చ్చ‌
రేటింగ్‌: 2.75

సింగిల్ లైన్‌:
ఒక లేడీ డాన్ వ‌ల‌లో ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయిన ఓ స‌గ‌టు కుర్రాడి జీవితంలో అనూహ్య ప‌రిణామాల స‌మాహార‌మే ఈ సినిమా. ఎంత పెద్ద లేడీ డాన్ అయినా ఆమె కూడా ఓ ఆడ‌దే, ఏనాటికైనా ఆ ల‌క్ష‌ణాల్ని గుర్తెర‌గాల్సిందే అని చెప్ప‌డ‌మే సినిమా ఉద్ధేశం.

ముందుమాట‌:
అల్ల‌రి న‌రేష్ సినిమా అంటే ఒక‌ప్పుడు మినిమం గ్యారెంటీ అన్న ట్యాగ్ ఉండేది. కానీ ఇటీవ‌లి కాలంలో ఆ ట్యాగ్‌కు తూట్లు పొడిచే క‌థాంశాల్లో న‌టించి న‌రేష్ పూర్తిగా బ్యాడ్ అయిపోయాడు. అత‌డు న‌టించిన సినిమాల‌న్నీ ప‌ర‌మ రొటీన్‌. అదోర‌కం కామెడీ, పంచ్ డైలాగులు, స్ఫూఫ్‌లే అని తీసిపారేసే ప‌రిస్థితి వ‌చ్చింది. వ‌రుస‌గా మూడు సినిమాలు ఫ్లాపుల‌య్యాక న‌రేష్ రియ‌లైజ్ అయ్యి జేమ్స్ బాండ్ క‌థాంశాన్ని ఎంచుకున్నాడ‌ని అనుకున్నారంతా. అయితే కీల‌క‌మైన టైమ్‌లో న‌రేష్ చేసిన ఈ సినిమా అత‌డిని ర‌క్షించేదేనా?  కాదా?  లేడీ డాన్ క‌థాంశంతో తెర‌కెక్కిన జేమ్స్‌బాండ్ అత‌డి కెరీర్‌కి ప్ల‌స్సా?  మైన‌స్సా? అన్న‌ది తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

క‌థ‌, క‌మామీషు:
నాని (అల్ల‌రి న‌రేష్‌) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌. స‌గ‌టు కుర్రాడు. పైగా పిరికివాడు. అంద‌రు కుర్రాళ్ల‌లాగే మంచి ఉద్యోగం చేసుకుంటూ ఓ అంద‌మైన పిల్ల‌ని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల‌వ్వాల‌నుకుంటాడు. ఉద్యోగం ఎలానూ ఉంది కాబ‌ట్టి ఇక పిల్ల‌ని వెతుక్కునే ప‌నిలో ప‌డ‌తాడు. కానీ అనూహ్యంగా అత‌డి జీవితంలోకి పూజ (సాక్షి చౌద‌రి) అనే లేడీ డాన్ ప్ర‌వేశిస్తుంది. ఆర‌డుగుల బుల్లెట్టు లా ఉన్న పూజ తాను డాన్ అన్న విష‌యాన్ని దాచిపెట్టి మోసంతో నానిని పెళ్లాడుతుంది. అస‌లు ఆ లేడీ డాన్  ఇలా మోసం చేసి పెళ్లాడ‌డాల్సిన అవ‌స‌రం ఏంటి?  నానికి మోసం గురించి తెలిశాక ఎలా రియాక్ట‌య్యాడు?  చివ‌రికి క‌థ ఏ కంచికి చేరింది? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. మోసం చేసి పెళ్లాడిన పూజ అస్స‌లు నానితో కాపురం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌దు. అహంకారం ప్ర‌ద‌ర్శిస్తుంది. ఆ క్ర‌మంలోనే త‌న‌లోని అస‌లైన ఆడ‌ది బైటికొస్తుంది. కొన్ని ఇన్సిడెంట్ల వ‌ల్ల ఆడ‌త‌నం గురించి తెలుసుకుని చివ‌రికి నానితో కాపురం చేసి బిడ్డ‌ను కంటుంది. భార్యాభ‌ర్త‌ల అనుబంధ‌మే త‌న‌ని మాఫియా వైరి వ‌ర్గాల నుంచి కాపాడుతుంది.. ఇదీ క‌థాంశం.

విశ్లేష‌ణ (ప్ల‌స్‌లు ~ మైన‌స్‌లు):
అయితే ఇంత‌టి సింపుల్ స్టోరీని ద‌ర్శ‌కుడు నేరేట్ చేసిన విధానం పూర్తి గంద‌ర‌గోళంలా అనిపిస్తుంది. ఒక స‌న్నివేశం త‌ర్వాత ఒక స‌న్నివేశం న‌వ్వించ‌డం కోసం రాసుకున్న‌వే అన్న‌ట్టు అర్థమైపోతుంటుంది. ప్రేక్ష‌కుడు ఎక్క‌డా క‌థ‌లో లీనం కాలేని ఓ గంద‌ర‌గోళం ఉంటుంది. అయితే లేడీ  డాన్‌గా సాక్షి అందాలు షోస్టాప‌ర్ అనిపిస్తాయి. డాన్‌గా త‌న‌ని ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన విధానం అద్భుతం. అయితే న‌రేష్ పాత్ర‌కు మాత్రం త‌గిన ప్రాముఖ్య‌త ల‌భించ‌లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే క్రేజు త‌గ్గింది కాబ‌ట్టి సాక్షి అందాల‌పైనే గురిపెట్టారా? అన్న సందేహ‌మూ క‌లుగుతుంది. అలాగే ముఖ్యంగా పెళ్లికొడుకు నానిని వెతుక్కుంటూ జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి అండ్ ఫ్యాక్ష‌న్‌ గ్యాంగ్ ఎందుకు తిర‌గాల్సొచ్చిందో అస్స‌లు క‌న్‌క్లూజ‌న్ ఉండ‌దు. అలాగే దుబాయ్‌లో త‌న‌ని ముప్పుతిప్ప‌లు పెట్టిన లేడీ డాన్‌ని హ్యాండిల్ చేయ‌డంలో బ‌డా (ఆశీష్ విద్యార్థి) అంత‌టి మాఫియా డాన్ ఏమీ చేయ‌లేక‌పోయాడే అనిపిస్తుంది. బ‌ల‌మైన విల‌నీని ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడ‌నే అనిపిస్తుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు, డైలాగులు మెరుపులు మెరిపించ‌డంతో ప్రేక్ష‌కుడి మోములో న‌వ్వులు కురిశాయి. శ్రీ‌ధ‌ర్ సీపాన డైలాగ్స్ టైమింగ్ సూప‌ర్భ్‌. ఈ సినిమాకి సాక్షి చౌద‌రి ఓ ప్ల‌స్ అయితే శ్రీ‌ధ‌ర్ రాసిన డైలాగులు ఇంకో ప్ల‌స్‌. ఇవి రెండూ లేక‌పోతే ఇక సినిమా లేన‌ట్టే. అలాగే ఈ చిత్రానికి పాట‌లు కొంత వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు. అయితే సినిమా చూస్తున్నంత సేపూ ఎన్టీఆర్ బాద్‌షా చిత్రానికి లేడీ వెర్ష‌న్‌లా అనిపిస్తుంది. ఆ స‌న్నివేశాలు, అందులో వ‌చ్చే పంచ్‌లు ఇవ‌న్నీ బాద్‌షాని త‌ల‌పిస్తాయి. శ్రీ‌నువైట్ల‌, కోన వెంక‌ట్ అండ్ గ్యాంగ్‌తో క‌లిసి ప‌నిచేసిన‌వాళ్లే ఈ సినిమాకి ప‌నిచేశారు కాబ‌ట్టి ఆ ప్ర‌భావం సినిమాలో క‌నిపించింద‌నే అనుకోవాలి.
సాంకేతిక నిపుణులు:
ఇలాంటి సినిమాల‌కు కెమెరా ఎప్పుడూ ప్ర‌భావ‌వంతంగానే ప‌నిచేయాలి. లేడీ డాన్‌ని ఎలివేట్ చేసే స‌న్నివేశాల్లో కెమెరా ప‌నిత‌నం క‌నిపించింది. అలాగే స‌న్న‌జాజి ప‌క్క‌మీద సంకురాత్రి పాట హైలైట్‌. ప‌బ్బులో పాట ఆక‌ట్టుకుంటుంది. సాయి కార్తీక్ సంగీతం యావ‌రేజ్‌. రీరికార్డింగ్ ప‌ర‌మ బోరింగ్‌. టీవీ సీరియ‌ళ్ల ఆర్‌.ఆర్ లా, న‌స పెట్టించింది. అలాగే సన్నివేశాల్ని క‌థ‌గా కూర్చాలంటే ఎడిటింగ్ చాలా కీల‌కం. ఆ విభాగం ఇంకా షార్ప్‌గా ప‌నిచేసి ఉంటే కాస్త క్రిస్పీనెస్ వ‌చ్చి ఉండేది. మిగ‌తా విభాగాల‌న్నీ సోసోనే.
న‌టీన‌టులు:
అల్ల‌రి న‌రేష్ పాత్ర ప‌రిధి మేర‌కు బాగానే న‌టించాడు. కానీ అంత‌గా న‌ట‌న‌కు స్కోప్ లేని సినిమా ఇది. సాక్షి చౌద‌రి న‌ట‌న‌, గ్లామ‌ర్ సినిమాకి పెద్ద అస్సెట్‌. మ‌ధ్య మ‌ధ్య‌లో మెరుపులా వ‌చ్చి పోయే పాత్ర‌లో స‌ప్త‌గిరి ఫ‌ర్వాలేద‌నిపించాడు. తాగుబోతు ర‌మేష్‌, అలీ చివ‌రిలో వ‌చ్చి చిన్న ఝ‌ల‌క్ ఇచ్చారు. మాస్‌ని న‌వ్వించే టాక్టీస్ ఈ రెండు పాత్ర‌ల‌తో ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌భ‌, చంద్ర‌మోహ‌న్ త‌దిత‌రుల క్యారెక్ట‌ర్ల‌కు అంత పెద్ద స్కోప్‌లేదు. 30ఈర్స్ ఇండ‌స్ర్టీ పృథ్వీ బాల‌య్య‌బాబును ఇమ్మిటేట్ చేయ‌డంలో అద‌ర గొట్టేశాడు.

ముగింపు:
బాద్‌షాకి లేడీ వెర్ష‌న్ ఇది. సాక్షి చౌద‌రి కోసం చూడొచ్చు.

రేటింగ్‌: 2.75

NO COMMENTS

Leave a Reply