మాఘ‌మాసం.. మోడీకి మూడో గండం

modi

మోడీ ఆఫ్గ‌నిస్తాన్ కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌తికూల వాతావ‌ర‌ణం మూలంగా విమానం అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది అది మొద‌టి గండం. ఊహించ‌ని విధంగా మ‌రోసారి పాకిస్తాన్ వెళ్లారు అది రెండో గండం. ఇక రానున్న మాఘ‌మాసం ఫిబ్ర‌వ‌రిలో మూడో గండం ఉంద‌ని .. ఇది చాలా తీవ్రంగా ఉంటుంద‌ని కర్ణాటకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు బ్రహ్మాండ నరేంద్ర శర్మ గురూజీ అన్నారు.

మోడీకి స్త్రీ దోశం ఉంద‌ని, మూడో గండం ఏ రూపంలో వ‌స్తుందో చెప్ప‌లేమ‌ని, ఇది త‌ప్పించుకుంటే మ‌రో 12 ఏళ్ల వ‌ర‌కు మోడీకి తిరుగులేద‌ని జ్యోతిష్యుడు చెబుతున్నారు. స్త్రీ దోషం మూలంగా ఆయ‌న భార్య‌కు దూర‌మ‌య్యార‌ని, త‌ల్లికి దూరంగా ఉంటున్నార‌ని, ఆయ‌న త‌ల్లిని త‌న వ‌ద్ద‌కు తెచ్చుకుని ఆమెకు సేవ‌చేస్తే దోషం త‌ప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని, పార్ల‌మెంటు వాస్తు కూడా మోడీకి అనుకూలంగా లేద‌ని అయ‌న అన్నారు.

NO COMMENTS

Leave a Reply