ప‌న్నీర్ వెన‌క మోడీ

 

modi

త‌మిళ‌నాడులో కేంద్రం చ‌క్రం తిప్పుతోంది. ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటు వెన‌క ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల నుండి శ‌శిక‌ళ‌కు వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె ముఖ్య‌మంత్రి పీఠం ఎక్క‌కుండా బీజేపీ చ‌క్రం తిప్పుతుంద‌ని తెలుస్తోంది. లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ తంబిదురై ద్వారా కేంద్రం పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేర‌కే జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద‌కు రాత్రి ప‌న్నీర్ సెల్వం వెళ్లాడ‌ని, ఆ మేర‌కే ఆరోప‌ణ‌లు చేశాడ‌ని అంటున్నారు.

ఇక త‌మిళ‌నాడు ఇంఛార్జ్ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావును శ‌శిక‌ళ మీద సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు త‌మిళ‌నాడులో అడుగుపెట్ట‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటుతో అన్నాడీఎంకె పార్టీ చీలుతుంద‌ని, అప్పుడు శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి కాకుండా ప‌న్నీర్ సెల్వం ముఖ్య‌మంత్రిగా ఉండేందుకు డీఎంకె పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు డీఎంకె నుండి వ‌ర్త‌మానం కూడా ప‌న్నీర్ సెల్వంకు పంపిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ప‌న్నీర్ సెల్వం ద్వారా త‌మిళ‌నాడు ప‌రిస్థితుల‌ను అవ‌కాశంగా తీసుకుని అక్క‌డ పాగా వేయాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

NO COMMENTS

Leave a Reply