బాబు మెడ‌కు మోడీ ఉరి !

modi-chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వ పాల‌న మీద కేంద్రం నిఘా ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తున్నార‌ని, చంద్ర‌బాబు మాట‌ల‌కు .. చేత‌ల‌కు ఎలాంటి పొంత‌న లేద‌ని, కేంద్రం ఇస్తున్న నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి అవినీతికి పాల్ప‌డుతూ తిరిగి కేంద్రం మీద‌నే విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం ప‌ట్ల మోడీ సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఆంధ్రాకు చెందిన కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు ప‌ట్ల కూడా అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రోజురోజుకి ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబు మీద పెరుగుతున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ఆంధ్రాలో బీజేపీ ఎదుగుద‌ల‌కు ఎలాంటి వ్యూహాలు అవ‌లంభించాలన్న దాని మీద చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ ఎద‌గ‌కుండా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు చేస్తుంటే దానికి వెంక‌య్య‌నాయుడు మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌డం బీజేపీ అధిష్టానానికి న‌చ్చ‌డం లేద‌ట‌.

2019 నాటికి త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌ల మీద ప‌ట్టుబిగించాల‌ని బీజేపీ భావిస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబుతో పొత్తు మూలంగా బీజేపీ ఎద‌గ‌లేద‌ని, ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని, దానికి కార‌ణం వెంక‌య్య అని ఆంధ్రా బీజేపీ నేత‌లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మోడీ ప్ర‌త్యేక దృష్టి సారించి స‌మ‌యం కోసం వేచిచూస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

NO COMMENTS

Leave a Reply