మోడీ స‌ర్కారు మోసం బ‌య‌ట‌ప‌డింది

dawood

కర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాది .. ముంబ‌యి పేలుళ్ల ప్ర‌ధాన సూత్ర‌ధారి దావూద్ ఇబ్ర‌హీంకు చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తుల‌ను యూఎఈ ప్ర‌భుత్వం సీజ్ చేసింది. ఈ ఘ‌న‌త అంతా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీదే. ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌లో చేసుకున్న‌ దౌత్య‌ప‌ర‌మ‌యిన ఒప్పందాల మూలంగానే ఇది సాధ్యం అయింది. ఆ ఆస్తులు భార‌త‌కే వ‌స్తాయి అని జాతీయ మీడియాకు లీక్ చేసి ఊద‌రగొట్టించారు. ఇక బీజేపీ కూడా ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేసింది.

అయితే ఈ వార్త విని సంబర‌ప‌డిన వారికి ఇప్పుడు షాకిచ్చే విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అస‌లు దావూద్ ఆస్తులు సీజ్ అన్న వార్త ఉట్టిదేన‌ట‌. ఈ వార్త‌ను మొద‌ట‌రాసిన జీ న్యూస్ ఇప్పుడు దీని గురించి నోరెత్త‌డం లేదు. బీజేపీ నేత‌ల‌ను, పార్టీ అధికార ప్ర‌తినిధిని అడిగితే అది నిజ‌మే అంటున్నారు. మ‌రి దానికి ఆధారం ఏంటి అంటే ఏదో ఒక‌టి ఉంటుంద‌ని లేకుండా ఎలా ఉంటుంద‌ని అంటున్నారు. త‌ప్పితే ఆధారం ఏంటో వారి వ‌ద్ద కూడా లేద‌ట‌. ఇక యూఎఈలోని భార‌తీయ ఎంబ‌సీని అడిగితే ఉత్త‌దే అంటుండ‌గా, అక్క‌డి భార‌తీయ మీడియా కూడా అదే స‌మాధానం ఇస్తోంది. మ‌రి ఎవ‌రిని మ‌భ్య‌పెట్ట‌డానికి మోడీ ప్ర‌భుత్వం ఇలాంటి ప్ర‌చారాల‌కు దిగుతుంది అన్న‌ది అర్ధంకాని ప్ర‌శ్న‌.

NO COMMENTS

Leave a Reply