ఆ దాడి వెనక …?!

ps2

ఇటీవల పోలీసులు కొట్టిన దెబ్బలకు ఓ వ్యక్తి మరణించాడని మారేడుపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడగా .. పోలీస్ స్టేషన్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారణ చేయగా ఆశ్చర్యకరమయిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్టేషన్ మీద దాడి వెనక రౌడీషీటర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో ఉన్న పాత పగలను మనసులో పెట్టుకుని వ్యక్తి మరణం ఆధారంగా బాధితులలో కలిసిపోయి పలువురు రౌడీషీటర్లు పోలీసులను కొట్టి పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారని తెలుస్తోంది. ఈ మేరకు పలు సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు రౌడీషీటర్లను గుర్తించారు. ఇప్పటికి 15 మందిని అదుపులోకి తీసుకున్నారని, మిగిలిన వారి కొరకు గాలింపు జరుగుతుందని సమాచారం.

ps1

NO COMMENTS

Leave a Reply